పాటకే బాలు జోలపాట

  • Published By: sreehari ,Published On : September 24, 2020 / 11:46 PM IST
పాటకే బాలు జోలపాట

S P Balasubramaniam: భారతదేశం తీర్చిదిద్దిన గొప్ప గాయకుడు. రెండు, మూడు తరాలు ఆయన పాటలువిని పెరిగింది. పాడింది. కొత్తతరం ఆయన శిష్యరికంలోనే ఎదిగింది. భారతదేశ గొప్ప గాయకతరంలో ఆయనది ముందు వరస.

ఆయన గాత్రం వింటే మధురాన్ని గొంతులో దాచుకున్నారా? శృతి చేయడానికి రాగాలు పోటీపడుతున్నాయా అన్నట్లుగా ఆయన పాట వినిపిస్తుంది. కథనాయలెవరైనా పాడేది మాత్రం బాలునే. ఆయన అందించిన సినీగానం 50వ వడిని దాటింది. పాట అంటే ఇలాగే పాడాలేమో అని తరాల శ్రోతలు అనుకునేట్టు చేశారు. గిన్నీస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో పేరు రాసుకున్నారు.



నెల్లూరు జిల్లా కొణెతమ్మ పేటలో జూన్‌ 4, 1946లో పుట్టారు. పేరు శ్రీపతి పండితా రాధ్యుల బాల సుబ్రమణ్యం. సంగీతంపై మక్కువ ఎక్కువ. పాటలు పాడటం హాబీ. కాలేజీల్లో సంగీత పోటీల్లో పాల్గొనటం.. సంగీత విభా వరులను నిర్వహించటంతో ఆయనకు అప్పుడే క్రేజ్ వచ్చింది. అప్పుడే సంగీత దర్శకుడు ఎస్పీ కోదండపాణి కళ్లలో పడ్డారు.

1966లో తన మొదటి పాటను ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’ సినిమాకు పాడారు బాలు. ఇది మహాగాయకుడికి వెండితెర జన్మ. 1980లో వచ్చిన ‘శంకరా భరణం’ సినిమా బాలూ సినీ జీవితాన్ని అంతెత్తుకు తీసుకెళ్లింది. ఆ సినిమాకు జాతీయ అవార్డును కూడా సుబ్రమణ్యం గెలుచుకున్నారు. అప్పుడే దేశాన్ని గెల్చారు. బాలీవుడ్ కూడా అపరూపంగా బాలును చూసింది.