రాజకీయాల్లో గంగిరెద్దులు : వెంకయ్య నాయుడు సెటైర్లు

  • Published By: chvmurthy ,Published On : January 13, 2019 / 10:25 AM IST
రాజకీయాల్లో గంగిరెద్దులు : వెంకయ్య నాయుడు సెటైర్లు

హైదరాబాద్ : గంగిరెద్దులను ఎక్కువగా గ్రామాలలో చూసేవాళ్ళమ‌ని, ఇప్పుడు రాజకీయాలలో కనపడుతున్నాయని  ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ లోని స్వర్ణ భారతి ట్రస్ట్ లో జరిగిన 2వ వార్షికోత్సవాలు, సంక్రాంతి సంబరాల్లో ఆయన మాట్లాడుతూ…. సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడం కూడా స్వర్ణభారత్ ట్రస్టు లక్ష్యాల్లో ఒకటని అన్నారు. గంగిరెద్దుల ఆటలో ఎన్నో అంశాలు ఇమిడి ఉన్నాయని యజమాని ఆదేశం ప్రకారం నడుచుకోవడం.. అనే విషయం అందులో దాగి ఉందని ఆయన చెప్పారు. మనకున్న ప్రతి పండగ వెనక శాస్త్రీయ సందేశం ఉందని వెంకయ్య నాయుడు చెప్పారు. 
జన్మభూమికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో స్వర్ణభారత్ ట్రస్టు ప్రారంభించామని ఆయన తెలిపారు. 18 ఏళ్లుగా ట్రస్టు తరుఫునసేవా కార్యక్రమాలు చేస్తున్నామని,ఇప్పుడు  నా సంకల్పాన్ని  కుమారుడు,కుమార్తె ముందుకు తీసుకువెళుతున్నారని చెప్పారు.  వ్యవసాయ దారులకుమేలు కలిగేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వార్షికోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీ రాధాకృష్ణన్, దర్శకుడు రాఘవేందరావు, మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ పాల్గోన్నారు. సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన గంగిరెద్దుల విన్యాసాలను అతిధులు తిలకించారు.  అనంతరం ముగ్గుల పోటీల్లోవిజేతలైనవారికి బహుమతులు అందచేశారు.