నల్లజాతీయుడు ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టి చంపేసిన అమెరికా పోలీసులు

10TV Telugu News

అమెరికాలో పోలీసుల దుశ్చర్యకు మరో నల్లజాతీయుడు బలైపోయాడు. కనీస మానవత్వం కూడా చచ్చిపోయిన తెల్లపోలీసులు దారుణంగా మరో నల్లజాతీయుడ్ని పొట్టనపెట్టుకున్నారు. ఇటీవల నల్లజాతి యువకుడు జార్జి ఫ్లాయిడ్‌ను పోలీసులు మెడపై తొక్కి చంపడంపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు పెల్లుబడకడం తెలిసిందే. అంతకంటే దారుణంగా..తలచుకుంటేనే వణికిపోయేవిధంగా పోలీసులు చంపేశారు. అతని ముఖానికి ఓ ప్లాస్టిక్ కవర్ చుట్టి ఊపిరాడకుండా చంపేసిన వీడియో ఒకటి బైటపడింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వీడియోపై అమెరికాలో మరోసారి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.గత మార్చి 23న న్యూయార్క్ లో నడిరోడ్డుపై పోలీసులందరూ కలిసి నల్లజాతీయుడికి చేతులు వెనక్కి విరిచి బేడీలు వేసి, ముసుగు కప్పి ఇంత దారుణంగా చంపడం హేయమనదని ఓ మనిషి ప్రాణాన్ని ఎంత సులువుగా తీసేసిన పోలీసులు అసలు మనుషులేనా? లేక మనిషి రూపంలో ఉన్న రాక్షసులా? అని విమర్శలు వెల్లువెత్తున్నాయి.

డేనియల్ ప్రూడ్ 41 ఏళ్ల వ్యక్తి తన సోదరుడి ఆరోగ్యం బాగోలేదని (911) మెడికల్ ఎమర్జెన్సీకి ఫోన్ చేసి బయటికి వచ్చారు. అయితే రాత్రిపూట అలా బైటతిరగటమేంటి? ఎటువంటి ఆందోళనలకు ప్లాన్ వేస్తున్నారు? నీతో పాటు ఇంకా ఎంతమంది ఉన్నారు? అంటూ ప్రశ్నించారు. దానికి అతను నాకూ ఆందోళనలకు ఎటువంటి సంబంధం లేదు..నా సోదరుడికి ఆరోగ్యం బాగాలేదు..మెడికల్ ఎమర్జెన్సీకి కాల్ చేశాను..దాని కోసమే ఎదురుచూస్తూ ఇలా బైటకొచ్చానని చెప్పాడు. కానీ పోలీసులు అతని మాటలు వినలేదు.గెరిల్లా ఆందోళనలు చేయడానికి మరికొందరి కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు..మాకు తెలీదనుకోకు అంటూ..అతని చొక్కాను విప్పించి బేడీలు వేసి రోడ్డుపై కూర్చోబెట్టారు. తనకు కరోనా ఉందని అతడు అరుస్తున్న పట్టించుకోకుండా దాడి చేశారు. దీంతో అతనికి ఆగ్రహం కలిగి పోలీసులపై అతడు ఉమ్మి వేశడు. దీంతో పోలీసులు మరింతగా రెచ్చిపోయారు..రాక్షసుల్లా వ్యవహరిస్తూ..ఫ్రూడ్ ముఖానికి మందపాటి ప్లాస్టిక్ కవర్ తొడిగారు.

దీంతో అతడు ఊపిరాడక అపస్మారకంలోకి వెళ్లాడు. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించగా వారం రోజుల తర్వాత అంటే మార్చి 30న ఆస్పత్రిలోనే చనిపోయాడు. ఇది హత్యేనని అతను సాధారణంగా చనిపోలేదని డాక్టర్లు నిర్ధారించగా ఆ విషయం బైటకొచ్చింది. దీంతో ప్రూడ్‌ను హత్య చేసిన పోలీసులను వెంటనే కోర్టు ముందు నిలబెట్టి శిక్షించాలని పోలీసు కార్యాలయం ఎదుట ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనలో పాల్గొన్నవారిని పోలీసులు చెదరగొట్టారు..9 మందిని అరెస్ట్ చేశారు.