ఉల్లి వ్యాపారులపై దాడులు

  • Published By: veegamteam ,Published On : November 7, 2019 / 11:40 AM IST
ఉల్లి వ్యాపారులపై దాడులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స అధికారులు ఉల్లిపాయల వ్యాపారులపై దాడులు చేపట్టారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీ రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ..47మంది వ్యాపారులు ఉల్లి విక్రయాలపై అవకతవకలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించామని తెలిపారు. కొంతమంది వ్యాపారులు అక్రమంగా ఉల్లిపాయలను స్టోర్ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారనీ..ఇప్పటి వరకూ రూ.27 లక్షలు విలువైన 603 క్వింటాళ్ల ఉల్లిపాయలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 

37 మందిపై జరిమానా విధించామనీ మరో 10మందిపై కేసులు నమోదు చేశామన్నారు. పలువురు వ్యాపారులకు  నోటీసులు జారీచేశామని తెలిపారు.రైతు బజార్లలోను కూడా తనిఖీలు చేయాలని అధికారులకు ఆదేశించామని  రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. 

కాగా ఉల్లిపాయల దిగుమతి తగ్గిపోయిందని..అందుకే ధరలు పెరగటానికి అదే కారణమని వ్యాపారులు వినియోగదారుల వద్ద అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో ఉల్లిపాయల రేటు అందనంతగా పెరిగింది.  ప్రజలకు చుక్కలు చూపెడుతోంది. కొన్ని రాష్ట్రాల్లో కిలో ఉల్లిపాయలు రూ.80 నుంచి రూ.100వరకూ అమ్ముతున్నారు. భోపాల్ లో కిలో ఉల్లిపాయలు రూ.120కి చేరుకునే అవకాశముందని కొంతమంది వ్యాపారులు చెప్పిన విషయం తెలిసిందే. 

కాగా..మార్కెట్ లో ఉల్లి దిగుమతి తగ్గిందనీ వ్యాపారులు ధరలు అందుకే పెరిగాయని అంటున్నారు.మరో పక్క తమ వద్ద అతి తక్కువ ధరలకే బలవంతంగా కొని వినియోగదారులకు అధిక రేట్లకు వ్యాపారులు అమ్ముతున్నారనీ తమకు మద్దతు ధర కల్పించాలని ఉల్లి రైతులు వాపోతున్నారు. ఇలా కారణం ఏదైనా గత కొంత కాలంగా ఉల్లి పాయలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి.