బాబూ ఎందుకీ ఏడుపు : విజయసాయిరెడ్డి 

  • Published By: madhu ,Published On : October 4, 2019 / 11:42 AM IST
బాబూ ఎందుకీ ఏడుపు : విజయసాయిరెడ్డి 

వైసీపీ, సీఎం జగన్ పైన నీచపు రాతలు రాసేందుకు వేల మందిని నియమించి, 24/7 కాల్ సెంటర్లను నిర్వహించిందెవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని..బానిస పత్రికలు, చానళ్లు ఎంత దాచి పెట్టినా సోషల్ మీడియా అరాచకాలన్నింటినీ బయట పెట్టింది…అందుకేనా ఈ ఏడుపు? అంటూ ఫైర్ అయ్యారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. అధికారం కోల్పోయినప్పటి నుంచి బాబు తీవ్ర మానసిక రుగ్మతలను ఎదుర్కొంటున్నారంటూ విమర్శించారు. తనను అందరూ మర్చిపోతున్నారనే ఆయనలో భయం వెంటాడుతోందన్నారు. అక్టోబర్ 04వ తేదీ శుక్రవారం ఆయన ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్స్ చేశారు. 

పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయని రాయించినా సీఎం జగన్ స్పందించక పోవడంతో ఆయనలో నిస్పృహ కట్టలు తెంచుకుందని బాబును ఉద్దేశించి వెల్లడించారు. సిగ్గు లేని బతుకులు ఎవరివో ఐదుగురి పేర్లు చెప్పమంటే ఆ తండ్రీకొడుకుల పేర్లు ఫస్టుంటాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ లిస్టులో కిరసనాయిలు తప్పని సరిగా ఉంటాడు..అంతగా అన్‌పాపులర్ అయ్యారు వీళ్లంటూ ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యం, మీడియా స్వేచ్ఛకు వీరి నిర్వచనాలు వేరేలా ఉంటాయని, జన్మలో మారరంటూ మండిపడ్డారు.

సోషల్ మీడియా వాల్స్‌పై ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు పోస్ట్ చేస్తారు.. అనాగరిక దూషణలుంటే fbకి ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. చంద్ర‘జ్యోతి’ ఎన్ని మంటలు రాజేయాలని చూసినా లాభం లేకుండా పోయిందనేదే సారు అసలు బాధ అని విమర్శించారు. పుత్ర రత్నం పెట్టిన ట్వీట్లు సుమతి శతకాల్లా కనిపిస్తున్నాయా బాబు గారూ? అంటూ ప్రశ్నించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. 

ఇటీవలే ఏపీలో సచివాలయ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. సచివాలయ పోస్టులకు సెప్టెంబర్ 1 నుంచి 8వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. లక్ష 26వేల 728 పోస్టులకు 19.74 లక్షల మంది పరీక్షలు రాశారు. పరీక్షలు నిర్వహించిన 10 రోజుల్లోనే ఫలితాలు రిలీజ్ చేశారు