అయేషా కేసు : పోస్ట్ మార్టం అంటే ఏంటీ? DNA పరీక్ష ఎలా నిర్వహిస్తారు..?

అయేషా కేసు : పోస్ట్ మార్టం అంటే ఏంటీ? DNA పరీక్ష ఎలా నిర్వహిస్తారు..?

12 సంవత్సరాల క్రితం హత్యాచారానికి గురై మృతి చెందిన బీ ఫార్మసీ విద్యార్థి అయేషా మీరా కేసు మరోసారి తెరపైకి వచ్చింది. అయేషా మీరాకు రీ పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. 12 ఏళ్ల తరువాత రీ పోస్ట్ మార్టం ఏంటీ అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఈ రీ పోస్ట్ మార్టం ద్వారా అయేషా మీరా డీఎన్ ఏను అధికారులు పరీక్షించనున్నారు. అసలు పోస్ట్ మార్టం అంటే ఏంటీ? DNA  పరీక్ష అంటే ఏంటో తెలుసుకుందాం..

పోస్ట్ మార్టం అంటే శవపరీక్ష. మరణానికి గల కారణాన్ని తెలుసుకుంటాం. పోలీసులు శవ‌ పంచనామా తరువాత  శవ‌ పరీక్ష కోసం గవర్నమెంట్ హాస్పిటలకు భౌతికకాయాన్ని తలిస్తారు. శవ పరీక్ష ద్వారా మృతుని మరణం ప్రమాదం వల్ల జరిగిందా, హత్య వల్ల జరిగిందా, ఆత్మహత్యా, అత్యాచారం వల్ల జరిగిందా తెలుసుకునే అవకాశం ఉంది.

శవ పరీక్ష ఎవరు నిర్వహిస్తారు? ఎలా నిర్వహిస్తారు?
శవ పరీక్షను ప్రభుత్వ డాక్టర్లు నిర్వహిస్తారు. శవాన్ని ఎవరు గుర్తించారో ఆ విషయాన్ని నివేదికలో డాక్టర్లు నమోదు చేయాలి. అదే విధంగా శవంపైన లోపల కన్పించిన గాయాల వివరాలను పొందుపరచాలి. ఏదైనా అన్య పదార్థం బాడీలో కన్పిస్తే దాన్ని జాగ్రత్త పరిచి ఫోరెన్సిక్‌ పరీక్షల నిమిత్తం పంపించాలి. ఆ నివేదిక వచ్చిన తరువాత అన్ని కలిసి డాక్టర్‌ శవ పరీక్ష నివేదికను కోర్టుకు, పోలీసులకు పంపించాల్సి ఉంటుంది. అందులో మృతుని మరణం ఎప్పుడు సంభవించిందో ఆ వివరాలు, మరణానికి గల కారణాన్ని పేర్కొనాలి.  బాడీని పోస్ట్ మార్టం కోసం తీసుకున్న తర్వాత రశీదుని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. శవ పరీక్ష పూర్తి అయిన తరువాత శవాన్ని పోలీసుల ద్వారా వారి బంధువులకు అప్పగించాలి. ఇది శవపరీక్ష ప్రాసెస్. 

డీఎన్ ఏ పరీక్ష అంటే..
రక్తం, చెమట, ఎముకలు, వెంట్రుకలు, గోళ్లు, కణజాలం ఇలా ఏదైనాసరే శరీరంలోని జీవ పదార్థాన్ని సేకరించడంతో డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ సాంపిల్స్ ఆధారంగా..వాటి కణాల్లోంచి డీఎన్‌ఏను ప్రత్యేక పద్ధతుల ద్వారా వేరు చేస్తారు. పాలిమరేస్‌ చైన్‌ రియాక్షన్‌ ద్వారా ఈ డీఎన్‌ఏ పోగుల సంఖ్యను నిపుణులు కొన్ని వేల రెట్లు పెంచుతారు. వీటన్నింటినీ ద్రావణంలోకి వేసి విద్యుత్తును కనెక్ట్ చేస్తారు.

ఈ ప్రక్రియను జెల్‌ ఎలక్ట్రోఫోరెసిస్‌ అంటారు. కొన్ని రసాయనాలను వినియోగటం ద్వారా ఈ డీఎన్ ఏ పోగులను ప్లాస్టిక్‌ కాగితంపై కనిపించేలా చేస్తారు. ఇలా రెండు జన్యు క్రమాలను పోల్చిచూసినప్పుడు  వాటిలో ఎంత మేరకు ఒకేలా ఉందో తెలిసిపోతుంది. 

నేరాలు జరిగిన కేసుల్లో నేర నిర్ధారణతోపాటు డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ ఎంతో ఉపయోగకరం. నేరాల నిర్ధారణకు..అంటే అత్యాచారాల కేసుల్లో నిందితుల అవశేషాల ఆధారంగా వ్యక్తుల్ని గుర్తించేందుకూ డీఎన్ ఏ పరీక్షల పద్ధతి చాలా కీలకం.

భూమ్మీద వందల కోట్ల మంది మనుషులుంటే.. ఇందులో ఏ ఒక్కరి డీఎన్‌ఏ కూడా ఇంకొకరి మాదిరిగా ఉండదు. దీంతో నిందితుల్ని గుర్తించటంలో డీఎన్ ఏ పరీక్షలు చాలా చాలా కీలకంగా మారాయి. క్లిష్టమైన నేరాల కేసుల్లో నిందితుల్ని డీఎన్ ఏ పరీక్షల ద్వారా కనిపెడుతున్నారు.  

12ఏళ్లకు రీ పోస్ట్ మార్టం…
అయేషా మీరాపై హత్యాచారం జరిగి, పోస్ట్ మార్టం కూడా పూర్తై, మృతదేహాన్ని పూడ్చిపెట్టి 12 ఏళ్లు అయిన తరువాత మరోసారి రీ పోస్ట్ మార్టం చేయటంపై అనేక సందేహాలు. ఇంతకాలం తర్వాత ఎముకలు మాత్రమే ఉంటాయని, వాటికి పోస్టుమార్టం నిర్వహిస్తే  ఒంటికి తగిలిన గాయాలు ఎలా తెలుస్తాయన్నది మరో ప్రశ్నలు..అభిప్రాయలు వెలువడుతున్నాయి. 

అనేక మలుపులు తిరుగుతున్న ఆయేషా మీరా కేసు మరోసారి అయేషా డీఎన్ఏ ని సీబీఐ అధికారులు మరోసారి సేకరించనున్నారు. 
2007 డిసెంబర్ 27న ఇబ్రహీంపట్నంలో అయేషా మీరాపై అత్యాచారం, హత్య 
2018 ఆగస్టు 17న సత్యంబాబు అరెస్ట్ 
2015 మార్చి 30న సత్యంబాబును నిర్ధోషిగా ప్రకటించిన హైకోర్ట్ 
అయేషా మీరా కేసులో 2017 మార్చి -2018 ఆగస్ట్ న సిట్ దర్యాప్తు 
2018 అక్టోబర్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ ను అయేషా మీరా తల్లిదండ్రులు కలిసారు 
12 సంవత్సరాల తరువాత అయేషా భౌతిక కాయానికి తెలనాలి చెంచుపేటలోని ఖబరస్తాన్ లో  రీ పోస్ట్ మార్టం