అయేషా కేసు : న్యాయం జరుగుతుందని రీ పోస్ట్‌మార్టంకు అంగీకరించాం : ముస్లిం పెద్దలు

  • Published By: veegamteam ,Published On : December 14, 2019 / 07:47 AM IST
అయేషా కేసు : న్యాయం జరుగుతుందని రీ పోస్ట్‌మార్టంకు అంగీకరించాం : ముస్లిం పెద్దలు

12 సంవత్సరాల క్రితం దారుణ పరిస్థితుల్లో హత్యకు గురైన మా బిడ్డలాంటి అయేషా మీరాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తూ తాము అయేషాకు  రీపోస్ట్ మార్టానికి అంగీకరించామని ముస్లం మత పెద్దలు తెలిపారు. ముస్లిం మత సంప్రదాయం ప్రకారం ఒకసారి పాతి పెట్టిన శవాన్ని బైటకు తీయమనీ దానికి మా సంప్రదాయం ఒప్పుకోదనీ..కానీ దారుణ హత్యకు గురైన అయేశాకు సీబీఐ ఎంక్వయిరీతో న్యాయం జరగుతుందని ఆశిస్తూ రీ పోస్ట్ మార్టంకు అంగీరించామని తెలిపారు. 

12 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నా..ఈ కేసు ఇప్పటికైనా న్యాయం జరగుతుందని తాము ఆశిస్తున్నామన్నారు.ఇప్పటికైనా అసలు నిందితుల్ని పట్టుకుని కఠినంగా శిక్షంచాలని ముస్లిం మతపెద్దలు డిమాండ్ చేశారు. సీబీఐపై తమకు నమ్మకం ఉందని అయేషా కేసులో ఇప్పటికైనా నిజాలు బైటకు వస్తాయనీ..అసలు నిందితులు బైటపడతాయనే నమ్మకం ఉందన్నారు. 

ఇటువంటి దారుణాలు జరగకుండా ఉండేలా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏ ఆడబిడ్డా కూడా అఘాయిత్యాలకు బలైపోయింకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కాగా..శనివారం (డిసెంబర్ 14) వైద్యుల సమక్షంలో ఐదు గంటలుగా అయేషా మీరా మృతదేహపు అవశేషాలను రీ పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన బీ-ఫార్మసీ స్టూడెంట్ ఆయేషా మీరా హత్యాచారం కేసులో.. విచారణను సీబీఐ మరోసారి వేగవంతం చేసింది. మృతదేహానికి రీ-పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలోని చెంచుపేట ఈద్గాలో అధికారులు రీ-పోస్టుమార్టం చేస్తున్నారు. సీబీఐ అధికారుల పర్యవేక్షణలో.. కుల పెద్దలు, కుటుంబసభ్యుల పెద్దలు సమక్షంలో ఈ ప్రక్రియ జరుగుతోంది. కృష్ణా జిల్లా ఇబ్రహింపట్నంలోని ఓ ప్రైవేట్ హాస్టల్ లో 2007 డిసెంబర్ 27న ఆయేషా మీరా దారుణ హత్యకు గురైంది. అత్యాచారం చేసిన అనంతరం దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే.

క్లుప్తంగా అయేషా హత్య వివరాలు  
అనేక మలుపులు తిరుగుతున్న ఆయేషా మీరా కేసు మరోసారి అయేషా డీఎన్ఏ ని సీబీఐ అధికారులు మరోసారి సేకరించనున్నారు. 
2007 డిసెంబర్ 27న ఇబ్రహీంపట్నంలో అయేషా మీరాపై అత్యాచారం, హత్య 
2018 ఆగస్టు 17న సత్యంబాబు అరెస్ట్ 
2015 మార్చి 30న సత్యంబాబును నిర్ధోషిగా ప్రకటించిన హైకోర్ట్ 
అయేషా మీరా కేసులో 2017 మార్చి -2018 ఆగస్ట్ న సిట్ దర్యాప్తు 
2018 అక్టోబర్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ ను అయేషా మీరా తల్లిదండ్రులు కలిసారు 
12 సంవత్సరాల తరువాత అయేషా భౌతిక కాయానికి తెనాలి చెంచుపేటలోని ఖబరస్తాన్ లో  రీ పోస్ట్ మార్టం