పరీక్షల ఇన్విజిలేటర్లుగా గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగులు

  • Published By: vamsi ,Published On : February 26, 2020 / 03:05 PM IST
పరీక్షల ఇన్విజిలేటర్లుగా గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని వచ్చిన వ్యవస్థ గ్రామ సచివాలయం వ్యవస్థ. ఇప్పటికే గ్రామాల్లో సేవలు అందిస్తున్న గ్రామ సచివాలయం ఉద్యోగులను విద్యా వ్యవస్థలో కూడా ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది.

ఈ క్రమంలోనే మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 8 వరకు జరిగే పదవ పరీక్షలకు వారి సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఓ ప్రకటన చేశారు.

గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగులను ఇన్విజిలేటర్లుగా నియమిస్తామని చెప్పుకొచ్చారు. మార్చి 4 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్‌ పరీక్షలు జరగనుండగా.. హాల్ టికెట్లపై క్యూ ఆర్ కోడ్.. పరీక్షా కేంద్రాలు తెలుసుకునేందుకు యాప్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక ఇంటర్‌లో గ్రేడింగ్‌తో పాటు మార్కులు కూడా ఇస్తామని తెలిపారు.