రెచ్చిపోయిన వీఆర్వో : పట్టా అడిగిన రైతుపై కారంపొడితో దాడి

పెద్దపల్లిలో దారుణం జరిగింది. ఓ వీఆర్వో రెచ్చిపోయింది. భూమి పట్టా కోసం నిలదీసిన మహిళా రైతుపై దాడి చేసింది. కారంపొడి చల్లింది. వివరాల్లోకి వెళితే.. సమ్మక్క అనే మహిళా

  • Published By: veegamteam ,Published On : November 28, 2019 / 07:17 AM IST
రెచ్చిపోయిన వీఆర్వో : పట్టా అడిగిన రైతుపై కారంపొడితో దాడి

పెద్దపల్లిలో దారుణం జరిగింది. ఓ వీఆర్వో రెచ్చిపోయింది. భూమి పట్టా కోసం నిలదీసిన మహిళా రైతుపై దాడి చేసింది. కారంపొడి చల్లింది. వివరాల్లోకి వెళితే.. సమ్మక్క అనే మహిళా

పెద్దపల్లిలో దారుణం జరిగింది. ఓ వీఆర్వో రెచ్చిపోయింది. భూమి పట్టా కోసం నిలదీసిన మహిళా రైతుపై దాడి చేసింది. కారంపొడి చల్లింది. వివరాల్లోకి వెళితే.. సమ్మక్క అనే మహిళా రైతు మంథనిలో వీఆర్వో సైరాభాను ఇంటికి వెళ్లింది. భూమి పట్టా ఎందుకు ఇవ్వడం లేదని నిలదీసింది. రూ.30వేలు లంచం తీసుకున్న తర్వాత కూడా పట్టా ఎందుకివ్వడం లేదని ప్రశ్నించింది. దీని గురించి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపంతో ఊగిపోయిన వీఆర్వో సైరాభాను.. కారంపొడితో రైతుపై దాడి చేసింది. దీనిపై సమ్మక్క పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.

సమ్మక్కది మంథని మండలం అడవి సోమన్ పల్లి. భూమి పట్టా కోసం తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరుగుతోంది. కాళ్లు అరిగేలా తిప్పుకుంటున్నారు కానీ.. పట్టా మాత్రం ఇవ్వడం లేదని సమ్మక్క వాపోయింది. పైగా వీఆర్వో సైరాభాను రూ.30వేలు లంచం తీసుకుందని ఆరోపించింది.

attack

అటు ఏపీలోని కృష్ణా జిల్లా ముసునూరులోనూ ఇలాంటి తరహా ఘటనే జరిగింది. క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు, ఎందుకు తిప్పుకుంటున్నారు అని అడిగిన దరఖాస్తుదారుడిపై రెవెన్యూ ఉద్యోగి దాడి చేశాడు. విచక్షణారహితంగా కొట్టాడు.