హిందూపురం వైసీపీ అభ్యర్ధి గోరంట్ల మాధవ్ కు వీఆర్ఎస్ కష్టాలు 

హిందూపురం వైసీపీ అభ్యర్ధి గోరంట్ల మాధవ్ కు వీఆర్ఎస్ కష్టాలు 

హిందూపురం వైసీపీ అభ్యర్ధి గోరంట్ల మాధవ్ కు వీఆర్ఎస్ కష్టాలు 

అనంతపురం : హిందూపురం పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ కు విఆర్ ఎస్ కష్టాలు వెన్నాడుతున్నాయి.  టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి సవాల్ విసిరి, మీసం తిప్పి తన ఉద్యోగానికి రాజీనామా చేసి, వైసీపీ లో చేరిన కదిరి అర్బన్ సీఐ గోరంట్లమాధవ్ ప్రకటించిన స్వఛ్చంద పదవీ విరమణకు (వీఆర్ఎస్) డిపార్ట్ మెంట్ నుంచి ఇంకా అనుమతి లభించలేదు. 

2018 సెప్టెంబర్ లో తాడిపత్రి సమీపంలోని ప్రబోధానంద ఆశ్రమం వద్ద వినాయక నిమజ్జనం సందర్భంగా జరిగిన ఘర్షణల్లో అనంతపురం పోలీసు అధికారుల సంఘం కార్యదర్శిగా ఉన్న, సీఐ గోరంట్ల మాధవ్ కి, జేసీ కి మధ్య వివాదం రాజుకుంది. ఆక్రమంలో ఆయన తన ఉద్యోగానికి వీఆర్ఎస్ ప్రకటించి వైసీపీలో చేరారు. తాజాగా పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి మాధవ్ కు  హిందూపురం పార్లమెంట్ టికెట్ కేటాయించారు. కాగా ….ఇంతవరకు మాధవ్ రాజీనామాకు డిపార్ట్మెంట్ పరంగా ఆమోదం లభించలేదు. నామినేషన్ల గడువు దగ్గర పడటంతో ఆయన ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. ఐదు రోజుల్లో వివరణ ఇవ్వాలని ట్రిబ్యునల్ పోలీసు శాఖను ఆదేశించింది. 

విఆర్ఎస్ ఆమోదానికి ఎలాంటి అడ్డంకులు ఉన్నాయనే వివరాలు తెలుసుకునేందుకు గోరంట్ల మాధవ్ కు కాల్ చేసినా అందుబాటులోకి రాలేదు. ఇప్పుడు మాధవ్ విఆర్ఎస్ అడ్డంకుల విషయం వైసీపీ లో చర్చనీయాంశం గా మారింది. మార్చి 23,24 సెలవు దినాలు కావడం, 25తో నామినేషన్ల గడువు ముగియటంతో అప్రమత్తమైన వైసీపీ అధిష్టానం మాధవ్ సతీమణిని ఎన్నికల బరిలో నిలిపే అంశాలను పరిశీలిస్తోంది. 

×