Mamata Banerjee’s ‘dream for India’: ‘నాకో కల ఉంది’ అంటూ తన జీవిత ఆశయం ఏంటో చెప్పిన సీఎం మమతా బెనర్జీ

‘దేశం, ప్రజల విషయంలో నాకో కల ఉంది. ఎక్కడ ఒక్కరు కూడా ఆకలి బాధతో ఉండరో, ఎక్కడ ప్రతి ఒక్క మహిళకు భద్రత ఉంటుందో, ఎక్కడ ప్రతి చిన్నారికి విద్యా కాంతులు చేరుతాయో, ఎక్కడ సమానత్వం వెల్లివిరుస్తుందో, ఎక్కడ ‘అణచివేత శక్తులు’ ప్రజలను విడగొట్టవో.. ఆ దేశం కావాలి’ అని మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. దేశ ప్రజాస్వామ్య విలువల ప్రకారం ప్రజలు నడుచుకోవాలని ఆమె చెప్పుకొచ్చారు.

Mamata Banerjee’s ‘dream for India’: ‘నాకో కల ఉంది’ అంటూ తన జీవిత ఆశయం ఏంటో చెప్పిన సీఎం మమతా బెనర్జీ

Mamata Banerjee's 'dream for India

Mamata Banerjee’s ‘dream for India’: ఐ హేవ్ ఏ డ్రీమ్ (నాకో కల ఉంది) అంటూ తన జీవిత ఆశయం ఏంటో చెప్పారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ‘ఐ హేవ్ ఏ డ్రీమ్’ అంటూ అప్పట్లో మార్టిన్ లూధర్ కింగ్, ‘ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో’ అంటూ విశ్వ కవి రవీంద్రనాథ్ చేసిన వ్యాఖ్యలను వాడుతూ మమతా బెనర్జీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వరుసగా ట్వీట్లు చేసుకొచ్చారు.

‘దేశం, ప్రజల విషయంలో నాకో కల ఉంది. ఎక్కడ ఒక్కరు కూడా ఆకలి బాధతో ఉండరో, ఎక్కడ ప్రతి ఒక్క మహిళకు భద్రత ఉంటుందో, ఎక్కడ ప్రతి చిన్నారికి విద్యా కాంతులు చేరుతాయో, ఎక్కడ సమానత్వం వెల్లివిరుస్తుందో, ఎక్కడ ‘అణచివేత శక్తులు’ ప్రజలను విడగొట్టవో.. ఆ దేశం కావాలి’ అని మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. దేశ ప్రజాస్వామ్య విలువల ప్రకారం ప్రజలు నడుచుకోవాలని ఆమె చెప్పుకొచ్చారు.

‘ఈ మహోన్నత దేశ ప్రజలకు నేను ఓ హామీ ఇస్తున్నాను. మనం కలలుగన్న భారత్‌ కోసం నేను ప్రతిరోజు కృషి చేస్తాను. భారత ప్రజలు తప్పకుండా మేల్కోవాలి. నిజమైన స్వాతంత్ర్యం అంటే ఏంటో గ్రహించాలి. భారత ప్రజలమంతా కలిసి మన పవిత్ర వారసత్వాన్ని కాపాడుకోవాలి. మన దేశ గౌరవాన్ని నిలబెట్టుకుంటూ మన ప్రజాస్వామ్య విలువలు, ప్రజల హక్కులను కాపాడుకోవాలి’ అని మమతా బెనర్జీ ట్వీట్లు చేశారు. కాగా, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ సందేశాన్ని ఇచ్చారు.

China-Taiwan conflict: తైవాన్ చుట్టూ మళ్ళీ యుద్ధ విన్యాసాలు చేపడతాం.. చైనా ప్రకటన