వాలంటీర్లకు వార్నింగ్ : జీతంలో రోజుకు రూ.166 కట్

గ్రామ, వార్డు వాలంటీర్లకు అధికారులు వార్నింగ్ ఇచ్చారు. విధులకు గైర్హాజరైతే సాలరీ కట్ చేస్తామన్నారు. వారి వేతనం నుంచి రోజుకు 166 రూపాయలను కట్‌ చేయనున్నారు. ఈ

  • Published By: veegamteam ,Published On : October 23, 2019 / 03:13 PM IST
వాలంటీర్లకు వార్నింగ్ : జీతంలో రోజుకు రూ.166 కట్

గ్రామ, వార్డు వాలంటీర్లకు అధికారులు వార్నింగ్ ఇచ్చారు. విధులకు గైర్హాజరైతే సాలరీ కట్ చేస్తామన్నారు. వారి వేతనం నుంచి రోజుకు 166 రూపాయలను కట్‌ చేయనున్నారు. ఈ

గ్రామ, వార్డు వాలంటీర్లకు అధికారులు వార్నింగ్ ఇచ్చారు. విధులకు గైర్హాజరైతే సాలరీ కట్ చేస్తామన్నారు. వారి వేతనం నుంచి రోజుకు 166 రూపాయలను కట్‌ చేయనున్నారు. ఈ మేరకు పంచాయతీ రాజ్‌శాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వాలంటీర్లకు ప్రభుత్వం నెలకు రూ.5వేలు చొప్పున వేతనంగా చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. జాబ్ లో జాయిన్ అయినా కొందరు విధులకు సరిగ్గా రావడం లేదనే విషయం అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు. సాలరీ కట్ చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో వాలంటీర్లు డ్యూటీకి కరెక్ట్ గా వస్తారని అధికారులు భావిస్తున్నారు.

ఇకపోతే ఒక వేళ వీరిలో ఎవరి జాయినింగ్‌ డేట్‌ తప్పుగా నమోదై వేతనం చెల్లింపులో అన్యాయం జరిగితే సరిచేయాలని ప్రభుత్వం తెలిపింది. వాలంటీర్లను తొలగించినా, వారే రాజీనామా చేసినా లేదా మరణించినా.. సంబంధిత MPDO CFMSకు తెలియజేయాలని ఆదేశించింది.

జగన్ సీఎం అయ్యాక వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షల మందిని వాలంటీర్లుగా నియమించారు. ప్రభుత్వ పథకాల కోసం ప్రజలు చేసుకునే ప్రతీ దరఖాస్తును గ్రామ, వార్డు వాలంటీర్లు పరిశీలించిన తర్వాత గ్రామ సచివాలయం ద్వారా సేవలందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో గ్రామ వాలంటీర్లు కీలకంగా మారిపోయారు. 

ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్ చొప్పున నియమించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారుల ఇంటికే తీసుకెళ్లడం కోసం వాలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ.. వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తినా తక్షణమే పరిష్కరించడం కోసం రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల మంది వాలంటీర్లు పని చేస్తున్నారు. వీరికి గౌరవ వేతనంగా నెలకు రూ.5 వేల జీతం ఇస్తున్నారు.