ప్రతి నీటి చుక్కకు బిల్లులు చెల్లించాల్సిందే

  • Published By: veegamteam ,Published On : February 11, 2019 / 04:33 AM IST
ప్రతి నీటి చుక్కకు బిల్లులు చెల్లించాల్సిందే

విలువైన తాగునీటి వృథాను అరికట్టడంలో భాగంగా ఇకనుంచి ప్రతి నీటి చుక్కకు బిల్లులు వసూలు చేయాలని జలమండలి అధికారులు నిర్ణయించారు. అందుకు తగిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. కొన్ని రోజుల కిందటి వరకు జలమండలి అధికారులు నల్లా కనెక్షన్ వినియోగదారులు మీటర్లను బిగించుకోకపోయినా చూసిచూడనట్లు వ్యవహరించారు. GHMC కమిషనర్, జలమండలి MD దానకిశోర్ తాగునీటి వృథాను అరికట్టడం కోసం ప్రత్యేకంగా అధికారులు, ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తాగునీటి వినియోగదారులు నీటిని వృథా చేయకుండా ప్రతీ నీటి బొట్టుకు బిల్లులు వసూలు చేయాలని నిర్ణయించారు.

వాడుకున్న నీటికే కాకుండా వృథా చేసే నీటికి బిల్లులు చెల్లించడం కంటే నల్లా నీటిని కేవలం తాగడానికి ఉపయోగించి, వేరేపనులకు బోరుబావుల నీటిని వాడుకుంటారని అధికారులు భావిస్తున్నారు. ఇకపై మీటర్లు బిగించుకోని వినియోగదారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులు నిర్ణయించారు.  

కొత్త మీటర్ల ఏర్పాటు:
ఇప్పటి వరకు మీటర్‌లు లేనివారి కోసం జలమండలి అధికారులు  మీటర్లను అందుబాటులో పెడుతున్నారు.  వినియోగదారులు అందుబాటులో ఉన్న మీటర్లనే కాకుండా వారివారి ఇష్టం మేరకు వారికి ఇష్టమైన చోటకూడా నీటిమీటర్లను కొనుగోలు చేయచ్చు. అధికారులు తనిఖీ కోసం వచ్చిన సమయంలో మీటర్‌లు లేని వినియోగదారులకు రెట్టింపు బిల్లులు వేయడంతో పాటు చర్యలు తీసుకోనున్నారు.