జేసీబీలో పెళ్లి బరాత్

  • Published By: madhu ,Published On : May 10, 2019 / 03:50 AM IST
జేసీబీలో పెళ్లి బరాత్

పెళ్లి అనేది జీవితాంతం గుర్తుండిపోయే సంఘటన. ప్రతి సందర్భమూ ప్రత్యేకమే. ఇద్దరూ పంచుకొనే క్షణాలు మధురమైనవి. వివాహ వేడుకను ఆనందమయం చేసుకోవాలని అనుకుంటుంటారు. అందుకు వినూత్న పద్ధతులను ఎంచుకుంటుంటారు. వివాహం అయిన అనంతరం వధూవరులతో బరాత్ నిర్వహిస్తుంటారు. కారు లేదా జీపు, గుర్రం..ఇలా బరాత్ జరుగుతుంటుంది. అయితే..ఓ వరుడు మాత్రం వినూత్నంగా బరాత్ నిర్వహించాడు. తనకు బతుకుదెరువు ఇచ్చిన ‘జేసీబీ’పై బరాత్ చేసుకున్నాడు.

వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం రామచంద్రాపురానికి చెందిన ఉడుతబోయిన రాకేష్..తండ్రితో కలిసి పనిచేసేవాడు. స్వయం ఉఫాధి కోసం జేసీబీని తీసుకుని నడుపుతున్నాడు. ఇతనికి వివాహం నిశ్చయమైంది. సంగెం మండలం..లోహిత గ్రామానికి చెందిన సుప్రియతో రాకేష్ వివాహం మే 08వ తేదీన ఘనంగా జరిగింది. అయితే..బరాత్ తన జేసీబీలో జరగాలని రాకేష్ నిర్ణయం తీసుకున్నాడు. జేసీబీని అందంగా అలంకరించారు. అందులో జీవీత భాగస్వామి సుప్రియతో కలిసి కూర్చొని బరాత్ నిర్వహించుకున్నాడు. దీనిని గ్రామస్తులు ఆసక్తిగా తిలంకించారు.