టెస్టింగ్ సక్సెస్ : ఉప్పొంగిన కాళేశ్వర గంగ

  • Published By: madhu ,Published On : April 24, 2019 / 07:06 AM IST
టెస్టింగ్ సక్సెస్ : ఉప్పొంగిన కాళేశ్వర గంగ

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో కీలకఘట్టం ఆవిష్కృతం అయ్యింది. రికార్డు సమయంలో నిర్మాణం పూర్తి చేసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నీటిని ఎత్తిపోసేందుకు ఏర్పాటు చేసిన భారీ మోటర్లలో మొదటి మోటర్ వెట్ రన్‌ ప్రారంభమైంది. ఏప్రిల్ 24వ తేదీ బుధవారం ఉదయం 11గంటలకు సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్‌, అధికారులు పూజలు నిర్వహించారు.

అనంతరం స్విచ్ఛాన్‌ చేసి వెట్ రన్‌ను ప్రారంభించారు. నంది మేడారం సర్జ్‌పూల్‌ నుంచి మోటార్లు నీటిని ఎత్తిపోస్తున్నాయి. కాళేశ్వరం గంగ బిరా బిరా పరుగులు పెట్టింది. నందిమేడారం రిజర్వాయర్‌కు చేరుకుంటాయి. అక్కడి నుంచి గోదావరి జలాలు లక్ష్మీపూర్‌ సర్జ్‌పూల్‌కు చేరనున్నాయి. లక్ష్మీపూర్‌ నుంచి ఎత్తిపోతల ద్వారా నీళ్లు మిడ్‌మానేరుకు చేరుకోనున్నాయి. 
Also Read : మాటల్లేవ్.. మైండ్ బ్లాంక్ : ఆయన పీల్చిన గాలి.. డబ్బాలో పెట్టి అమ్మేస్తున్నారు

సాంకేతిక ప్రక్రియలన్నీ విజయవంతంగా పూర్తయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్ మొదలు అనేక జిల్లాల్లో 151 టీఎంసీలకుపైగా గోదావరి జలాలను రిజర్వాయర్లకు తరలించి నిల్వ చేసేందుకు మొత్తం 82 మోటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్యాకేజ్-6, ప్యాకేజీ-7 ద్వారా 8వ ప్యాకేజీకి తరలించి అక్కడి వరద కాలువ ద్వారా మిడ్ మానేర్‌…అక్కడి నుంచి ఎస్సారెస్పీకి…అటు నుంచి రైతుల పంటపొలాల్లోకి తరలించే అవకాశముంది. ప్రాజెక్ట్‌ పనులు చివరి దశకు చేరుకోవడంతో ఇటు అధికారులు…అటు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : రూ.50లక్షలు, ఉద్యోగం, నివాసం : 2002 అల్లర్ల కేసులో సుప్రీం సంచలన తీర్పు