ఈసీ ముందుకు టీడీపీ టెక్నికల్ టీం: లోపాలు నిరూపిస్తారా?

  • Published By: vamsi ,Published On : April 15, 2019 / 01:33 AM IST
ఈసీ ముందుకు టీడీపీ టెక్నికల్ టీం: లోపాలు నిరూపిస్తారా?

ఈవీఎంలలో తప్పులు ఉన్నాయంటూ చెబుతున్న టీడీపీ ఇవాళ ఈసీ ముందుకు.. ఆ పార్టీ టెక్నికల్ టీమ్‌ను పంపనుంది. కేంద్ర ఎన్నికల సంఘంతో ఉదయం 11 గంటలకు భేటి కానుంది. అయితే టీడీపీ పంపే టెక్నికల్ టీమ్‌లో మాత్రం హరి ప్రసాద్ ఉండటానికి వీల్లేదని సీఈసీ చెబుతుంది. హరిప్రసాద్ కాకుండా ఇతర టెక్నికల్ టీమ్‌తో చర్చించేందుకు సిద్ధమని చెబుతుంది. ఇదిలా ఉంటే సీఈసీ ఈవీఎంలో తప్పులు ఉండటం వల్లే హరిప్రసాద్ రాకను అడ్డుకుంటుందని, టీడీపీ ఆరోపిస్తుంది.

రాజకీయ కుట్రలో భాగంగానే, సీఈసీ తనను వద్దని అంటుందని హరిప్రసాద్ చెబుతున్నారు. 2010లో తనపై కేసుకు సంబంధించి ఛార్జిషీటే దాఖలు కాలేదని, అలాంటప్పుడు తనపై కేసు ఉందని ఈసీ చెప్పడం కరెక్ట్ కాదని టీడీపీ టెక్నికల్‌ నిపుణుడు హరిప్రసాద్‌ చెప్తున్నారు. ఈసీ తన తప్పులను కప్పి పుచ్చుకునేందుకే ఇటువంటి మెలిక పెడుతుందని ఆరోపిస్తున్నారు.

ఇప్పుడు టీడీపీ మాత్రం హరిప్రసాద్ లేకుండా ఈసీ ముందుకు వెళ్లే అవకాశం లేదు. హరిప్రసాద్‌కు నో ఎంట్రీ అనే పరిస్థితిలో టీడీపీ మరోసారి సీఈసీకి లేఖ రాయనుంది. ఇదిలా ఉంటే టీడీపీ ఎన్నికలను రద్దు చేయమని అడగట్లేదు. వీవీప్యాట్లలోని 50 శాతం స్లిప్పులను కౌంట్ చేయ్యాలని డిమాండ్ చేస్తుంది. ఓటర్లు ఎవరికి ఓట్లు వేశారో వారికే పడిందో? లేదో? తేలాలని అంటుంది. ఈ విషయంపై దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చ జరుగుతుంది.