ఈ యుద్ధ ట్యాంక్‌లను చూసి, చైనా ఎందుకు భయపడుతోంది?

  • Published By: sreehari ,Published On : October 8, 2020 / 06:14 PM IST
ఈ యుద్ధ ట్యాంక్‌లను చూసి, చైనా ఎందుకు భయపడుతోంది?

T-90M Bhishma: మహాభారతానికి ఆచరివ నుంచి ఈ చివరివరకు ఉన్న బీష్ముడి పేరును ఈ యుద్ధట్యాంక్ కు పెట్టారు. లఢక్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ లోని ప్రతికూల వాతావరణాలు, కొండలు, గుట్టలు, చలిలో శత్రువును అడ్డుకొనేలా ఈ యుద్ధట్యాంక్ తయారుచేశారు.

ఇండియా ఎదుగుతున్న సైనిక శక్తి. చైనా సూపర్ పవర్. అమెరికానే టార్గెట్ చేసింది. ఇలాంటి ఈ రెండుదేశాల మధ్య ఎముకలుకొరికే చలిలో యుద్ధపరిస్థితులంటే ప్రపంచానికి ఆందోళనే. లద్ధాఖ్‌లో సైన్యాలను మోహరించడం ఇరుదేశాలకు ఇబ్బందే. అందుకే వచ్చేనెలలో Chinese President Xi Jinpingతో కలవబోతున్నారు మోడీ.



అయినా సరే, ఇరుదేశాలూ వింటర్‌వార్‌కి సిద్ధం. ఇండియా మరో అడుగుముందుకేసింది. రష్యాతయారీ టి-72, టి-90 ట్యాంక్‌లను మోహరించింది. చైనా గీతదాటితే ఒకేసారి వేయి గుళ్లతో వర్షం కురుస్తుంది. ఈ సంగతి డ్రాగన్‌కూ తెలుసు.

వణుకుపుట్టించే చలి, కర్కశమైన పర్వతాల్లో Winter Warలో చైనాతో యుద్ధంలో గెలవాలంటే ఇవి సరిపోతాయా?



గాల్వన్ వాలీ ఘర్షణల తర్వాత, చైనాతో యుద్ధపరిస్థితులున్నాయని ఇండియన్ మిలటరీ ఒప్పుకుంది. అందుకే చైనా రక్షణ వలయాలను ధ్వంసం చేయగల T-90 Bhishma Tanksలను మోహరించింది. వాటితోపాటు T-72M1 tanksకూడా రెడీ. లద్ధఖ్ కీలక ప్రాంతాల్లో BMP-2 infantry combat vehiclesలు తిరుగుతున్నాయి.

Chumar, Chushul sectorల్లో భీష్మ యుద్ధట్యాంకులు పరహాకాస్తుంటే, రష్యన్ టి-90 ట్యాంక్‌లను Depsang మైదానాల్లో మోహరించారు. ఇక్కడే ఇండియన్ ఆర్మీ పెట్రోలింగ్ ను చైనా అడ్డుకుంది.



కీలక ప్రాంతల్లో భారత,రష్యా యుద్ధ‌ట్యాంక్‌లు చైనావైపు గురిపెడితే, ఆకాశం నుంచి రక్షణగా Rafales రెడీ.

లద్ధక్ ప్రాంతాలు శీతాకాలంలో మంచుగడ్డ అయిపోతాయి. మైనస్ 30 డిగ్రీలకు దిగువుకు టెంపరేచర్ తగ్గిపోతుంది. దీనికితోడు శీతలగాలు.

ఇలాంటి పరిస్థితుల్లో ఏ ట్యాంక్ కూడా పనిచేయలేదు. ఒక్క భీష్మ యుద్ధ ట్యాంక్ తప్ప. మైనస్ 40 డిగ్రీల్లోనూ, అంటే మంచు గడ్డకట్టే వాతావరణంలోనూ నిప్పుల వర్షం కురిపించగలదు. అందుకోసం గడ్డకట్టని ప్రత్యేక ఇంధనాన్ని భీష్మకి వాడతారు.

చైనాకున్న ట్యాంక్ బలం ఇలాంటి పరిస్థితుల్లో చురుగ్గా కదల్లేదు. నూరుశాతం పోరాడటంలేదు. ఇక్కడే ఇండియాకి ఎడ్వాంటేజ్. ఏమాత్రం పరిస్థితి అదుపుతప్పినా రాఫెల్ యుద్ధవిమానాల నీడలో, భీష్మ యుద్ధ ట్యాంక్‌లు నిప్పులు కక్కుతూ చైనావైపు దూసుకెళ్లగలవు. అందుకే భీష్మ అంటే చైనాకి హడల్.