నేడే ఆఖరి రోజు.. రాజకీయ నేతల్లో టెన్షన్!

  • Published By: vamsi ,Published On : March 28, 2019 / 01:29 AM IST
నేడే ఆఖరి రోజు.. రాజకీయ నేతల్లో టెన్షన్!

ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి నామినేషన్ల దాఖలకు ఎక్కువ రోజులు అవకాశం లేకపోవడంతో.. ఆఖరిరోజు భారీ స్థాయిలో నామినేషన్లను వేశారు అభ్యర్థులు. నామినేషన్ల పరిశీలన పూర్తి కాగా.. నేడే(2019 మార్చి 28) నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి రోజు. ఈక్రమంలో అసంతృప్తులను బుజ్జగించేందుకు పార్టీల నేతలు తీవ్రప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల్లో వివిధ సందర్భాల్లో చీలిక ఓట్లతో ప్రత్యర్ధి పార్టీలు లాభపడుతాయి.

ఈ క్రమంలో రెబెల్స్‌గా బరిలోకి దిగిన నేతన నామినేషన్‌లు విత్‌డ్రా చేసుకుంటారా? లేదా? అనేది పార్టీలకు పెద్ద సవాల్‌గా మారింది. పార్టీల నేతలు కూడా టెన్షన్ పడుతున్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో రెబల్‌గా వేసిన అభ్యర్థులు మెయిన్ క్యాండిడేట్‌ల గెలుపు ఓటములపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

అందుకే ఎలాగైనా అసమ్మతి నేతలను బుజ్జగించాలని మెయిన్ పార్టీలు భావిస్తున్నాయి. నామినేషన్ల ఉపసంహరణకు నేడే ఆఖరు అయినా ఇప్పటివరకు ఉపసంహరణ చేసుకున్న అభ్యర్ధుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. అయితే నేతలు చేస్తున్న ప్రయాత్నాలు ఎంతవరకు ఫలితాలను ఇస్తాయనేది సాయంత్రం వరకు తెలుస్తుంది.