నీ స్ఫూర్తికి హ్యాట్సాప్ తల్లీ : ఇంట్లో భర్త శవం.. నిబ్బరంగా వచ్చి ఓటు వేసింది

  • Published By: veegamteam ,Published On : May 10, 2019 / 11:27 AM IST
నీ స్ఫూర్తికి హ్యాట్సాప్ తల్లీ : ఇంట్లో భర్త శవం.. నిబ్బరంగా వచ్చి ఓటు వేసింది

చిన్న గొడవ జరిగితేనే గగ్గోలు పెడతాం.. గిల్లికజ్జాలకే భార్యభర్తలు కొట్టుకుంటారు.. చీటికీమాటికీ గొడవలు, అలకలు.. ఇలాంటి రోజుల్లో సమాజం గురించి ఎవరు పట్టించుకుంటారు. ఓటు కోసం సెలవు ఇస్తే హాలీడే అని ఎంజాయ్ చేసే రోజులివి. సినిమాలు, షికార్లు, ఊర్లకు వెళుతున్నారు. నేను ఒక్కన్ని ఓటు వేయకపోతే ఏమౌతుంది అనే ఫీలింగ్ భావిస్తున్నారు. పట్టణాల్లో ఉద్యోగం చేసే వారు అయితే ఓటు కోసం గ్రామాలకే వెళ్లటం లేదు. ఇలాంటి వారికి ఈ మహిళ ఆదర్శం. ఆమె వేసిన ఓటు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఆమె గుండె నిబ్బరానికి జోహార్ అంటోంది సమాజం. వివరాల్లోకి వెళితే..

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని పేరూర్ గ్రామం. శ్రీనివాసరెడ్డి, ఉమ దంపతులు. హైదరాబాద్ లో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పరిషత్ ఎన్నికల క్రమంలో.. స్వగ్రామంలో ఓటు వేసేందుకు పేరూరు వచ్చారు. అప్పటికే ఒంట్లో బాగోలేదంటూ డాక్టర్ కు చూపించుకున్నాడు. మందులు కూడా తీసుకున్నాడు. మే 10వ తేదీ ఉదయం శ్రీనివాసరెడ్డి బాత్ రూంకి వెళ్లాడు. అక్కడే జారి పడ్డాడు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చనిపోయాడు. విషయం తెలిసి షాక్ అయ్యింది భార్య ఉమ. బంధువులకు సమాచారం ఇచ్చింది.

కళ్ల ముందు భర్త శరం.. గ్రామంలో ఎన్నికలు. పోయిన భర్త తిరిగిరాడు.. ఓ 30 నిమిషాలు గుండె నిబ్బరం చేసుకుంటే ఓటు వేసి రావొచ్చని భావించింది ఉమ. 
అనుకున్నదే తడవుగా ఇంట్లోని భర్త శవాన్ని ఉంచి.. పోలింగ్ బూత్ కు వచ్చింది ఆమె. ఓటు వేసి వెళ్లింది. విషయం తెలిసి అందరూ షాక్ అయ్యారు. ఓ వైపు భర్త పోయిన మహిళను ఓదార్చుతూనే.. ఇలాంటి సమయంలో కూడా బాధ్యతను విస్మరించకుండా ఓటు వేసినందుకు హ్యాట్సాప్ అంటున్నారు.