ఆవును రక్షించేందుకు వెళ్లి మహిళ మృతి

  • Edited By: veegamteam , September 5, 2019 / 06:39 AM IST
ఆవును రక్షించేందుకు వెళ్లి మహిళ మృతి

విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కోడూరులో విషాదం నెలకొంది. ఆవు ఆకలి తీర్చేందుకు వెళ్లి… ఓ మహిళ తనువు చాలించింది. ఓ స్థలంలో ఆవు గడ్డి మేస్తుండగా…. అక్కడ పడి ఉన్న కరెంట్‌ వైరు కాలికి తగిలి ఆవు చనిపోయింది. 

ఇది గమనించిన రాములమ్మ ఆవును రక్షించాలని ఆరాట పడింది. ఆవుపై పడి ఉన్న విద్యుత్‌ వైరును తొలగించే ప్రయత్నం చేసింది. దీంతో విద్యుత్‌ వైరు తగిలి రాములమ్మ కూడా అక్కడికక్కడే చనిపోయింది. ఆమె కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. రాములమ్మ మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.