వావ్.. యాక్ రికార్డ్ : 11 అడుగుల కొమ్ములతో గిన్నిస్ ను కుమ్మిపారేసింది..

  • Published By: nagamani ,Published On : September 19, 2020 / 11:08 AM IST
వావ్.. యాక్ రికార్డ్ : 11 అడుగుల కొమ్ములతో గిన్నిస్ ను కుమ్మిపారేసింది..

ఎవరన్నా ఓవర్ యాక్షన్ చేస్తే ‘‘ఏంటిరోయ్..నెత్తిపైన కొమ్ములు మొలిచాయా’ అంటుంటాం. కానీ కొన్ని జంతువులకు అంటే దుప్పిలాంటి జంతువులకు ఆ కొమ్ములే అందం తెచ్చిపెడతాయి. మరికొన్ని జంతువులకు కొమ్ములే ఆయుధాలు. కొమ్ములతోనే అవి రక్షించుకుంటాయి. అటువంటి కొమ్ములు ఓ జంతువుకు ఏకంగా గిన్నీస్ రికార్డ్ తెచ్చిపెట్టింది. ఓ జడల బర్రె కొమ్ములతో పాత గిన్నిస్ రికార్డును కుమ్మిపారేసింది. కొత్త రికార్డును సృష్టించేసింది.


అమెరికాలోని మిన్నెసొటాలో ఉండే జెరికో అనే సదురు బర్రె కొమ్ములు పొడవు11.36 అడుగులు. గతంలో అమెరికాకు చెరబందిన పాంచో వియా అనే పేరు కలిగిన ఓ ఎద్దు 10.7 అడుగులతో రికార్డును సంపాదించుకుంది. ఆ రికార్డును జెరికో వెనక్కి నెట్టేసింది…నావి అంతకంటే పెద్ద కొమ్ములు అంటే ముందుకొచ్చింది. పాంచో కొమ్ములు సాఫీగా ఉంటే, జెరికో కొమ్ములు మెలి తిరిగి ఉన్నాయి.


బర్రెల పంపెంకం మానేసిన ఓ వ్యక్తి జెరికోని మెలోడీ, హుఫ్ అనే దంపతులకు ఆరేళ్ల కిందట పెంచుకొమ్మని ఇచ్చేశాడట. అంతేసి కొమ్ములున్నా జెరికో ఏమాత్రం పొగరుగా ఉండదని..చాలా శాంతంగా..ప్రేమగా ఉంటుందని ఓనర్లు చెబుతున్నారు. దీని గొప్పతనం తెలుసుకున్న గిన్నిస్ ప్రతినిధులు కొమ్ముల పొడవు కొలిచి వరల్డ్ రికార్డ్ కట్టబెట్టారు. దీని కొమ్ములు చూస్తే మాత్రం ఓరి నాయనో ఏం పెరిగాయిరాబాబు కొమ్ములు అంటాం.