జేసీకి కౌంటర్ : పోలీసు బూటును ముద్దు పెట్టుకున్న YCP ఎంపీ

  • Published By: veegamteam ,Published On : December 20, 2019 / 05:02 AM IST
జేసీకి కౌంటర్ : పోలీసు బూటును ముద్దు పెట్టుకున్న YCP ఎంపీ

పోలీసు అమరవీరుడి బూటును ముద్దు పెట్టుకుని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి  వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్  కౌంటర్ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే..ఎమ్మెల్యేలకు..మంత్రులకు సెల్యూట్ చేసే పోలీసుల్ని కాదు..మా బూట్లు నాకే పోలీసులకు ఉద్యోగాల్లో పెట్టుకుంటామంటూ జేసీ దివాకర్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలకు వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పోలీసు అమరవీరుడు బూటను ముద్దు పెట్టుకుని కౌంటరిచ్చారు. 

గతంలో జేసీకి సీఐగా ఉన్న గోరంట్లకు మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఇద్దరి మధ్యా మాటల యుద్ధం కొనసాగింది. ఈ క్రమంలో జేసీపై గోరంట్ల మీసం తిప్పారు. సవాల్ చేశారు. అనంతరం కీలక పరిణామాల వైసీపీ పార్టీ గోరంట్లకు ఎంపీ టిక్కెట్ ఇచ్చింది.  తన పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసిన గోరంట్ల ఎంపీగా గెలిచారు.
ఈ క్రమంలో జేసీ దివాకర్ రెడ్డి కొన్ని రోజుల క్రితం బూట్లు నాకే పోలీసుల్ని ఉద్యోగాల్లో పెట్టుకుంటామంటూ చేసిన వ్యాఖ్యలకు ఎంపీ గోరంట్ల తీవ్రంగా రియాక్ట్ అయ్యారు.

జేసీపై మీసం తిప్పిన తనను సీఎం జగన్ ఎంపీని చేసి పార్లమెంట్ కు పంపించారనీ..జగన్ పాలనలో అనంతపురం జిల్లాలో హింసాత్మక ఘటనలు ఆగిపోయాయనీ..గత ప్రభుత్వ హయాంలో అనంతపురంలో పాతకక్షలతో కొట్టుకుని..చచ్చిపోయేవారని జగన్ ప్రభుత్వాన్ని చూసి టీడీపీ నాయకులు బుద్ధి తెచ్చుకోవాలని అన్నారు.