ప్రభుత్వంలో RTC విలీనం : కక్కలేక మింగలేక బాబు అవస్థలు 

  • Published By: veegamteam ,Published On : September 6, 2019 / 08:49 AM IST
ప్రభుత్వంలో RTC విలీనం : కక్కలేక మింగలేక బాబు అవస్థలు 

మాజీ సీఎం చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వరస విమర్శలతో విరుచుకుపడుతున్నారు. సీఎం జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. అది చూసి చంద్రబాబు మింగలేక కక్కలేక నానా తంటాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించి..కమీషన్లు దండుకునే చంద్రబాబుదైతే దాని జగన్ పూర్తి విరుద్ధమన్నారు. తన సంస్థ అయిన హెరిటేజ్ కోసం ఏపీ డెయిరీని చంద్రబాబు నాశనం చేశారని..తన కుటుంబం, తన సొంత మనుషుల కోసం 40 సంవత్సరాల పాటు ఆరాటపడ్డ బతుకు చంద్రబాబుది అంటూ విమర్శలు సంధించారు.  

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి సీఎం జగన్ 60వేలమంది కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపారని అది అసాధారణ నిర్ణయమని…ప్రజల కోసం జగన్ పాటు పడుతున్నారనే మాటకు ఇదొక ఉదాహరణ అని ప్రశ్నించారు.  సీఎం జగన్ ఆర్టీ విషయంలో తీసుకున్న ఈ నిర్ణయం సాహసోపేతమైనదనీ..దాన్ని అభినిందించటానికి పచ్చ బానిస మేధావులెవరికీ నోరు రావటంలేదన్నారు. పచ్చ కుల మీడియా అయితే  విలీనం అసంభమని మొన్నటి వరకూ పసలేని వాదలను తెరపైకి తెచ్చింది..కానీ ఇప్పుడు ఆర్టీసీ విలీనం ప్రకటించిన తరువాత దానికి కూడా నోరు లేకవటంలేదన్నారు.  

ఆర్టీసీ కార్మికులకిచ్చిన ఒక్క హామీనీ చంద్రబాబు  నెరవేర్చలేదు. ప్రైవేటు ఆపరేటర్లకు కోసం ఆర్టీసీని కొల్లగొట్టారు. విలువైన భూములను తన వాళ్లకు మల్టీప్లెక్సుల నిర్మాణాలకు లీజుకిచ్చారనీ.. ఆర్టీసీని మూసివేత దశకు చంద్రబాబు చేర్చితే సీఎం జగన్  ఇచ్చిన మాట కోసం నిలబడి ఆర్టీసీకి  ఊపిరి పోశారని విజయసాయిరెడ్డి అన్నారు.