జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం : భవనాలకు వైసీపీ జెండా రంగులు

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లోని పంచాయతీ భవనాలకు రంగులు మార్చాలని ఆదేశించింది. పంచాయతీ భవనాల రంగులు మార్చేయనుంది. వైసీపీ

  • Published By: veegamteam ,Published On : August 31, 2019 / 10:45 AM IST
జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం : భవనాలకు వైసీపీ జెండా రంగులు

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లోని పంచాయతీ భవనాలకు రంగులు మార్చాలని ఆదేశించింది. పంచాయతీ భవనాల రంగులు మార్చేయనుంది. వైసీపీ

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లోని పంచాయతీ భవనాలకు రంగులు మార్చాలని ఆదేశించింది. వైసీపీ జెండాలోని కలర్లు (వైట్, గ్రీన్, బ్లూ) వేయనున్నారు. పంచాయతీ భవనాలతో పాటు గ్రామ సచివాలయ భవనాలకు కూడా వైసీపీ జెండాలోని కలర్లు వేయనున్నారు. దీంతో పంచాయతీ, గ్రామ సచివాలయ భవనాలన్నీ వైసీపీ జెండా రంగుల్లోకి మారిపోనున్నాయి. అక్టోబర్‌ 2 నుంచి గ్రామ సెక్రటేరియట్‌‌లో ఈ మార్పు కనిపించనుంది.

పంచాయతీ భవనాలన్నీ కొత్త రంగుల్లోకి మార్చాలంటూ గ్రామ సచివాలయ భవన నమూనాను అన్ని జిల్లాలకు పంపింది పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ. ఇప్పటికే గ్రామాల్లో ఉన్న పంచాయతీ భవనాలను ఇదే విధంగా మార్పులు చేయాలని, కొత్తగా ఏర్పాటు చేసే భవనాలకు సైతం ఇదే విధానాన్ని అమలు చేయాలని పంచాయతీరాజ్ ‌శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్ అన్ని జిల్లా‌ల కలెక్టర్లకు సూచించారు.

జగన్ ప్రభుత్వం ఏపీలో గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. గ్రామాల్లో ప్రజలకు ఏ అవసరమొచ్చినా, సమస్య ఎదురైనా అక్కడే పరిష్కారమయ్యేలా ఈ వ్యవస్థకు రూపకల్పన చేశారు. గ్రామాల్లో వాలంటీర్లను నియమించిన ప్రభుత్వం.. అదే తరహాలో సచివాలయాల్లో ఉద్యోగుల్ని నియమించేందుకు కసరత్తు ప్రారంభించింది. అక్టోబర్ 2 నుంచి గ్రామ సచివాలయాలను సీఎం జగన్ ప్రారంభింస్తారు. సచివాలయంలో ఉద్యోగాల భర్తీకి రిక్రూట్ మెంట్ ప్రక్రియమొదలైంది. గ్రామ, వార్డు సచివాలయాల్లోని 1.26 లక్షల పోస్టులకు 22 లక్షలమంది అప్లయ్ చేసుకున్నారు. సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు 5వేల 314 కేంద్రాల్లో రాత పరీక్ష నిర్వహించనున్నారు. ప్రతిభ ఆధారంగానే ఎంపిక ప్రక్రియ జరుగుతుందని, పారదర్శకత ఉంటుందని అధికారులు తెలిపారు.