జగన్ పాదయాత్ర : యాత్రతో ప్రజల్లో భరోసా – వైవీ

  • Edited By: madhu , January 9, 2019 / 09:50 AM IST
జగన్ పాదయాత్ర : యాత్రతో ప్రజల్లో భరోసా – వైవీ

శ్రీకాకుళం : ప్రజా సంకల్ప యాత్రతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ ప్రజలకు భరోసా కల్పించారంటున్నారు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. జగన్ చేపట్టిన పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇచ్చాపురంలో వైసీపీ భారీ బహిరంగసభ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సుబ్బారెడ్డితో టెన్ టివి ముచ్చటించింది. రాష్ర్టానికి, రాష్ర్ట ప్రజలకు సీఎం చంద్రబాబు చేసిన అన్యాయాన్ని వివరించారన్నారు. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవడంతోపాటు.. ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తామని స్పష్టం చేశారు. జగన్ చేపట్టిన పాదయాత్ర ఘనవిజయం సాధించిందని..వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. పాదయాత్రకు బ్రేకులు వేయడానికి ప్రతిపక్షాలు ప్రయత్నించాయని ఆరోపించారు. ప్రజల ఆశీర్వాదం ఉండబట్టే జగన్ పాదయాత్ర నిర్విరామంగా కొనసాగిందన్నారు.