బాబు పార్ట్‌నర్..ఒక యాక్టర్ : మోసాల్లో వాటా ఉందా – జగన్

  • Published By: madhu ,Published On : March 28, 2019 / 06:15 AM IST
బాబు పార్ట్‌నర్..ఒక యాక్టర్ : మోసాల్లో వాటా ఉందా – జగన్

బాబు పార్ట్ నర్..ఒక యాక్టర్..బాబు స్క్రిప్టు ప్రకారం..ఏది పడితే అలా మాట్లాడుతున్నాడని..బాబు చేసిన మోసాల్లో వాటా ఉందా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రశ్నించారు. నాలుగు సంవత్సరాలు టీడీపీతో కాపురం చేసిన సమయంలో అవినీతి..అక్రమాలు కనిపించలేదా అని నిలదీశారు. ఎన్నికల్లో భాగంగా మార్చి 28వ తేదీన గురువారం పాలకొల్లుకు వచ్చిన జగన్..బహిరంగసభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పవన్‌పై పరోక్షంగా విమర్శలు చేశారు. 

సొంత చిన్నాన్న చనిపోయిన విషయంలో బాబుకు సపోర్టుగా ఆ పార్ట్ నర్..యాక్టర్ మాట్లాడడని గుర్తు చేశారు. ఇదే మీ కుటుంబంలో బాబు మనుషులు హత్య చేసి..మీ బంధువులే హత్య చేశారని అంటే ఎలా ఉంటుంది అన్నారు. బాబు తరపున పార్ట్ నర్..యాక్టర్ ప్రచారం చేసి ఓటు వేయాలని ప్రచారం చేశారని..అంటే ఈ ఐదేళ్ల కాలంలో జరిగిన మోసాలు..అక్రమాల్లో మీకు వాటా లేదా అని ప్రశ్నించారు. 4 సంవత్సరాలు టీడీపీతో కలిసి కాపురం చేశారని, ఇప్పుడు బయటకొచ్చారని, అయినా..జరుగుతున్న మోసాలపై ఆయన ప్రశ్నించకుండా తనపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు జగన్. పార్ట్ నర్..యాక్టర్ నామినేషన్ వేసిన సమయంలో టీడీపీ జెండాలు దర్శనమిచ్చాయన్నారు.