ఇదీ బాబుగారి ప్రేమ : కన్నతల్లిని కూడా చూసుకోలేదు

శ్రీకాకుళం : ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ మండిపడ్డారు. చంద్రబాబుకి ప్రేమలు, విలువలు తెలియవు అన్నారు. చంద్రబాబు కన్నతల్లిని కూడా

  • Published By: veegamteam ,Published On : April 1, 2019 / 12:03 PM IST
ఇదీ బాబుగారి ప్రేమ : కన్నతల్లిని కూడా చూసుకోలేదు

శ్రీకాకుళం : ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ మండిపడ్డారు. చంద్రబాబుకి ప్రేమలు, విలువలు తెలియవు అన్నారు. చంద్రబాబు కన్నతల్లిని కూడా

శ్రీకాకుళం : ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ మండిపడ్డారు. చంద్రబాబుకి ప్రేమలు, విలువలు తెలియవు అన్నారు. చంద్రబాబు కన్నతల్లిని కూడా చూసుకోలేదన్నారు. జగన్ పై ప్రేమతో తల్లి, చెల్లి ఎన్నికల ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు చేసిన కామెంట్స్ కు విజయమ్మ కౌంటర్ ఇచ్చారు. ప్రేమలు, విలువల గురించి చంద్రబాబుకి ఏం తెలుసు? అని మండిపడ్డారు. పాలకొండలో వైసీపీ ఎన్నికల ప్రచారంలో విజయమ్మ మాట్లాడారు. చంద్రబాబు తీరుని తప్పుపట్టారు.
Read Also : జగనే కారణం : పులిలాంటి కడప పిల్లిలా మారింది

చంద్రబాబు ఎవరిని ఉద్దరించారు? అని విజయమ్మ ప్రశ్నించారు. చంద్రబాబు ప్రజలను ప్రేమించారా? కుటుంబసభ్యులను ప్రేమించారా? అని నిలదీశారు. చంద్రబాబు కేవలం తన కొడుకు లోకేష్ ను మాత్రమే ప్రేమించారని, అర్హత లేకున్నా లోకేష్ కు మూడు పదవులు కట్టబెట్టారని విజయమ్మ విమర్శించారు. చంద్రబాబు తన తమ్ముడి కుటుంబాన్ని చూసుకోలేదన్న విజయమ్మ.. పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుది అని విమర్శలు చేశారు.
Read Also : పవన్ హామీలు : స్టూడెంట్స్‌కి ల్యాప్ టాప్.. ఆడపిల్లలకు మహాలక్ష్మి పథకం