మీరు చెప్పినవన్నీ గుర్తున్నాయి : నేనున్నాను – జగన్

  • Published By: madhu ,Published On : March 28, 2019 / 06:33 AM IST
మీరు చెప్పినవన్నీ గుర్తున్నాయి : నేనున్నాను – జగన్

తాను గతంలో చేసిన పాదయాత్రలో ప్రజలు చెప్పిన అన్ని విషయాలు గుర్తుకున్నాయని..తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత..అన్ని సమస్యలను పరిష్కరిస్తానని వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రజలకు హామీనిచ్చారు. బాబు పాలనలో ఏ వర్గానికి న్యాయం జరగలేదని…అక్రమాలు, అవినీతి, మోసాలు జరిగాయన్నారు. కుట్రలు, అబద్దాలతో ఐదేళ్ల పాలన సాగిందని, ఎన్నికలు వచ్చేసరికి బాబు చేస్తున్న కుట్రలు తనను బాధిస్తున్నాయన్నారు. కష్టాలు వచ్చిన సమయంలో వెంటనే స్పందిస్తానని, జగన్‌కు ఏమైనా అయితే..మొదట సంతోషపడేది బాబు..ఎల్లో మీడియా అని తెలిపారు. 

రూ. 3 లక్షలు మాఫీ : – 
మార్చి 28వ తేదీన పాలకొల్లు నియోజకవర్గంలో జగన్ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు పాలనపై దుమ్మెత్తిపోశారు. తాను పాదయాత్ర చేసిన సమయంలో పాలకొల్లు ప్రజలు పలు సమస్యలు తెలియచేశారని చెప్పారు. పెంకులపాడులో అవినీతి ప్లాట్ల గురించి తనకు జనాలు చెప్పారన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెంకులపాడులో భూమిని కొనడం జరిగినట్లు..అదే భూములతో ప్రజల జీవితాలతో బాబు చెలగాటమాడారన్నారు. 300 అడుగుల ప్లాట్‌ నిర్మాణంలో మొత్తం అవినీతి జరిగిందన్నారు. రూ. 3 లక్షలు దాటని ప్లాటును రూ. 6 లక్షల రూపాయలకు అమ్ముతున్నారని..కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరో లక్షన్నర ఇంటి నిర్మాణానికి ఇస్తుందని..అయితే మిగిలిన రూ. 3 లక్షల పరిస్థితి ఏంటీ అని ప్రశ్నించారు. ఇది పేదవాడు 20 సంవత్సరాలు పాటు కడుతూ పోవాలని..తాము అధికారంలోకి వస్తే ఈ రూ. 3 లక్షలు మాఫీ చేస్తామన్నారు జగన్. లంచాలు తీసుకొనేది బాబు..ఈ లంచాలకు పేదోడు కష్టపడాలా ? అని ప్రశ్నించారు. 

రైతుల సమస్యలు : –
పక్కనే గోదావరి ఉన్నా రెండో పంటకు నీళ్లు లేవన్నారు. ఎక్కడా రైతులకు గిట్టబాటు ధర లేదని..పామాయిల్, పొగాకు పంటల విషయంలో తమ పార్టీ ఆందోళన చేస్తేనే ధర కొంచెం పెంచారని గుర్తు చేశారు. పాలకొల్లులో తీవ్రమైన నీటి సమస్యలున్నాయి..వంద పడకల ఆసుపత్రి సంగతి ఏంటీ ? అని నిలదీశారు. 

ఉద్యోగాల విషయం : – 
ఉద్యోగాలు వస్తాయని వేలకు వేలు పెడుతూ విద్యార్థులు కోచింగ్ సెంటర్లలో చదువుకుంటున్నారని..కానీ ఉద్యోగాలు రాకపోవడంతో వారు వలసలు పోతున్నారని తెలిపారు. ప్రత్యేక హోదా వల్ల ఎన్నో రాయితీలు..పరిశ్రలు..ఉద్యోగాలు వస్తాయని ఆశ పడిన నిరుద్యోగులకు బాబు ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందన్నారు జగన్