వల్లభనేని వంశీ రోజుకో మాట మాట్లాడుతాడు: జగన్‌కి సినిమా హీరోల కంటే అభిమానులు ఎక్కువ- యార్లగడ్డ

  • Edited By: vamsi , November 20, 2019 / 06:19 AM IST
వల్లభనేని వంశీ రోజుకో మాట మాట్లాడుతాడు:  జగన్‌కి సినిమా హీరోల కంటే అభిమానులు ఎక్కువ- యార్లగడ్డ

ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రూట్‌ మారి వైసీపీలోకి వచ్చేందుకు ప్లాన్ చేసుకోవడంతో, గన్నవరం నియోజకవర్గంలో రాజకీయ ప్రకంపనలు స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు మీడియాతో మాట్లాడారు. గన్నవరం నియోజకవర్గం వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న యార్లగడ్డ వల్లభనేనితో పోటీ పడి ఎన్నికల్లో ఓడగా.. ఇప్పుడు వంశీ పార్టీలోకి రానున్నారనే వార్తల మధ్య ముఖ్యమంత్రి జగన్‌ను కలిసినట్లు చెప్పారు.

అయితే భేటీలో వంశీ విషయం ప్రస్తావనకు రాలేదని, సమస్యలపై మాత్రమే మాట్లాడినట్లు చెప్పారు. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో ఓడామని, జనవరి, ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికల్లో 90శాతం సీట్లు వచ్చేలా కృషి చేస్తామని చెప్పినట్లు వెల్లడించారు. ఈ రాష్ట్రంలో సినిమా హీరోల కంటే జగన్ కి అభిమానులు ఎక్కువ ఉన్నారని, ఆయన మీద నమ్మకం అటువంటిది అని అన్నారు. అందుకే అమెరికా వదిలి తాను కూడా వచ్చినట్లు చెప్పారు.

పార్టీ జెండా మోసిన ఏ కార్యకర్తకు ఇబ్బంది రానివ్వను అని ఈ సంధర్భంగా అన్నారు. వల్లభనేని వంశీ ఇంకా పార్టీలోకి రాలేదని, వస్తాడో? రాడో? తెలియకుండా ఎలా మాట్లాడుతాను?  అని అన్నారు. వంశీ విషయం ముఖ్యమంత్రి దగ్గర చర్చకు రాలేదు అని అన్నారు. వంశీ రోజుకో మాట మాట్లాడుతాడని, నేను హింసించానని కొన్నిసార్లు చెబుతాడు, వైసీపీ వేధిస్తుందని అంటాడు. అని అన్నారు 

ఇక గన్నవరం నియోజకవర్గంలో వంశీ రాజీనామా చేస్తే, ఎవరు పోటీ చేస్తాడు అనేది జగన్ నిర్ణయిస్తారని అన్నారు. వంశీ అనేవాడు వస్తాడో రాడో అతనికే తెలియాలి. నేను జగన్ గారి కోసం నేను పని చేస్తున్నా.. ప్రభుత్వంకు మద్దతు పలుకుతాను.. అంటే అది వాళ్ల ఇష్టం. అయితే అధికారుల వేధింపులకు బయపడి పార్టీకి సపోర్ట్ చేస్తున్నారా? ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై సపోర్ట్ చేస్తున్నారా? అనేది అసలు క్లారిటీ లేదని అన్నారు. జగన్ నాయకత్వంను సమర్థిస్తే సమర్థించవచ్చు అని అందులో అభ్యంతరం లేదని, ఎవరైనా జగన్ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తారని అన్నారు యార్లగడ్డ.