లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime

సెక్స్ లో పాల్గొనాలని ఒత్తిడి..యువతిపై పినతండ్రి అత్యాచారం..సహకరించిన తల్లి

Published

on

ఓ వైపు భారతదేశాన్ని కరోనా గడగడలాడిస్తుంటే..మరోవైపు దారుణ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. సభ్యసమాజం తలదించుకొనేలా కొంతమంది వ్యవహరిస్తున్నారు. కామంతో కళ్లు మూసుకపోయి ప్రవర్తిస్తున్నారు. వరుసకు పినతండ్రి అయిన..ఓ వ్యక్తి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

తన తల్లి కూడా అతడికి సహకరించిందని బాధితురాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

అసలేం ఏం జరిగింది : –
రీమా అనే మహిళ..తన భర్తతో విడాకులు తీసుకుంది. ఈమెకు యుక్త వయస్సున కూతురు ఉంది. అనంతరం అలెగ్జాండర్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. అలెగ్జాండర్ ఓ నిర్మాణ కంపెనీలో సూపర్ వైజర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. బాధిత యువతి నగరంలోని ఓ కాలేజీలో చదువుతోంది. తల్లి, పినతండ్రితో కలిసి అరెకెరెలో నివాసం ఉంటోంది.

నిద్రమాత్రలు ఇచ్చిన తల్లి : – 
ఇదిలా ఉంటే..యువతిపై పినతండ్రి కన్నుపడింది. టీ, తినే పదార్థాల్లో నిద్రమాత్రలు వేసి కూతురుకు ఇచ్చేది. మత్తులో జారుకున్న అనంతరం పిన తండ్రి అత్యాచారానికి పాల్పడేవాడు. తనకు కడుపునొప్పి లక్షణాలు కనబడ్డాయని, పినతండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిసిందని యువతి హుళిమావు పోలీసులకు తెలిపింది.
హైదరాబాద్ లో ఓ హోటల్ కు తీసుకెళ్లి బలవంతంగా మద్యం

లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనాలని ఒత్తిడి : – 
తాగించి..అత్యాచారానికి పాల్పడ్డాడని వాపోయింది. కాలేజికి పోవద్దని, మోడలింగ్ చేయాలని, లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనాలని పీడించే వాడని, పలుమార్లు తనకు తెలియకుండా మద్యం, డ్రగ్స్ ఇచ్చి మత్తులోకి జారుకున్న అనంతరం అత్యాచారం చేసేవాడని..దీనికి తల్లి సహకారం ఉందని బాధితురాలు వెల్లడించింది.

ప్రాణభయం ఉంది..రక్షణ కల్పించండి : – 
బయట ఈ విషయం తెలిస్తే ఊరుకునేది లేదని బెదిరింపులకు పాల్పడేవాడని, తీవ్రమనస్థాపానికి గురై ఇళ్లు వదిలిపెట్టి వెళ్లానని తెలిపింది. తనకు ప్రాణభయం ఉందని రక్షణ కల్పించాలని కోరింది. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొందని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం కామంతో కళ్లు మూసుకపోయి..ఈ దారుణ ఘటనకు పాల్పడిన నీచుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Read Here>>అమితాబ్ కు కరోనా…ప్రార్థించను అంటున్న వర్మ

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *