Undipo - Full Video song from ISmart Shankar

‘ఉండిపో ఉండిపో’ వీడియో సాంగ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఎనర్జిటిక్ స్టార్ రామ్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్.. ‘ఇస్మార్ట్ శంకర్’.. నుండి ‘ఉండిపో ఉండిపో’ వీడియో సాంగ్ రిలీజ్..

ఎనర్జిటిక్ స్టార్ రామ్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్.. ‘ఇస్మార్ట్ శంకర్’.. (డబుల్ దిమాఖ్ హైదరాబాదీ).. నిధి అగర్వాల్‌, నభా నటేష్ హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమా జూలై 18న విడుదలై.. పాజిటివ్ టాక్‌తో పాటు, మంచి కలెక్షన్లు కూడా రాబట్టింది. హీరో రామ్  కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడమే కాక.. చాలా కాలం తర్వాత పూరీని హిట్ ట్రాక్‌లోకి తీసుకొచ్చింది.

పూరీ బర్త్‌డే సందర్భంగా ‘ఇస్మార్ట్ శంకర్’.. రీ-రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 27, 28, 29 తేదీలలో ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల్లో 10 థియేటర్లలో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. రీసెంట్‌గా ‘ఇస్మార్ట్ శంకర్’ నుండి ‘ఉండిపో ఉండిపో’ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. మణిశర్మ ట్యూన్‌కి, భాస్కరభట్ల బ్యూటిఫుల్ లిరిక్స్ రాయగా, అనురాగ్ కులకర్ణి, రమ్యా బెహరా పాడారు.

Read Also : జాన్ అబ్రహాం – సత్యమేవ జయతే 2..

అనీ లామా కొరియోగ్రఫీ చేశారు. ఈ సాంగ్‌లో రామ్, నిధిల కెమిస్ట్రీ బాగుంటుంది. గోవాలో ఈ సాంగ్ పిక్చరైజ్ చేశారు. సంగీతం : మణిశర్మ, కెమెరా : రాజ్ తోట, ఎడిటింగ్ : జునైద్ సిద్ధికీ, ఆర్ట్ : జానీ షేక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : విషు రెడ్డి, నిర్మాణం : పూరీ జగన్నాధ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్..

 

 

Related Tags :

Related Posts :