కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కన్నుమూత

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Ram Vilas Paswan passes away లోక్ జనశక్తి పార్టీ(LJP)వ్యవస్థాపకుడు, కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్(74) కన్నుమూశారు. గురువారం సాయంత్రం ఢిల్లీలోని ఓ హాస్పిటల్ లో రామ్ విలాస్ పాశ్వాన్ తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

పాపా ప్రస్తుతం మీరు ఈ ప్రపంచంలో లేరు. కానీ, మాకు తెలుసు. మీరు ఎక్కడ ఉన్నా నాతోనే ఉంటారు అంటూ చిరాగ్ పాశ్వాన్ భావోద్వేగంగా ట్వీట్ చేశారు. మిస్ యూ పాపా అంటూ చిన్నతనంలో తనను ఎత్తుకున్న ఫోటోను షేర్ చేశారు. పాశ్వాన్ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులు, నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.చాలాకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రామ్ విలాస్ పాశ్వాన్…కొన్ని వారాలుగా ఢిల్లీలోని ఓ ప్రేవేటు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. పాశ్వాన్ కు శనివారం హార్ట్ సర్జీరీ కూడా జరిగింది.


దాదాపు 5 దశాబ్దాలకు పైగా యాక్టీవ్ పాటిటిక్స్ లో పాశ్వాన్ ఉన్నారు. బీహార్ కు చెందిన పాశ్వాన్ భారత్ లో గుర్తించదగిన దళిత నేతల్లో ఒకరుగా పాశ్వాస్ గుర్తింపు పొందారు. పాశ్వాన్ 8 సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 2014 నుంచి మోడీ కేబినెట్ లో కేంద్రమంత్రిగా పాశ్వాన్ కొనసాగుతున్నారు.

2004లో యూపీఏలో చేరిన పాశ్వాన్…గతంలో కూడా కేంద్రమంత్రిగా పనిచేశారు. గతంలో కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిగా,రైల్వైశాఖ మంత్రిగా,రసాయన,ఎరువుల శాఖ మంత్రిగా,గనుల శాఖ మంత్రిగా,కార్మిక సంక్షేమశాఖ మంత్రిగా పాశ్వాన్ పనిచేశారు. ప్రస్తుతం ప్రస్తుత వినియోగదారుల వ్యవహారాల, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిగా ఉన్నాడు.

సంయుక్త సోషలిస్టు పార్టీ సభ్యుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన పాశ్వాన్..1969 లో అలౌలి నియోజకవర్గం నుంచి తొలిసారిగా శాసనసభకు ఎన్నికయ్యారు. 1974 లో లోక్ దళ్ ఏర్పడిన తరువాత దానిలో చేరి ప్రధాన కార్యదర్శి అయ్యాడు. అతను ఆ కాలంలో అత్యవసర పరిస్థితిని వ్యతిరేకించినందున అతనిని అరెస్టు చేసారు. అతను 1977 లో హాజీపూర్ నియోజకవర్గం నుండి జనతా పార్టీ సభ్యుడిగా లోక్‌సభలో ప్రవేశించాడు. జనతా పార్టీ టికెట్‌పై మొదటిసారి పార్లమెంట్ ఎన్నికలలో గెలిచాడు. 1980, 1989, 1996, 1998, 1999, 2004, , 2014 లో మళ్లీ పార్లమెంటు సభ్యునిగా ఎంపికయ్యాడు. 2000లో లోక్ జన శక్తి పార్టీని పాశ్వాన్ స్థాపించాడు.

Related Tags :

Related Posts :