కేంద్రమంత్రి సదానంద గౌడకి కరోనా

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Sadananda Gowda tests positive for coronavirus కేంద్ర రసాయన మరియు ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడకి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కరోనా సోకిన వ్యక్తులతో దగ్గరిగా మెలిగిన తనలో కరోనా లక్షణాలు కనబడటంతో టెస్ట్ చేయించుకున్నానని…టెస్ట్ రిపోర్ట్ పాజిటివ్ వచ్చిందని సదానంద గౌడ తెలిపారు. ప్రస్తుతం తాను స్వీయ నిర్భందంలోకి వెళ్లినట్లు ఆయన తెలిపారు.తనతో దగ్గరిగా మెలిగినవాళ్లు జాగ్రత్తగా ఉండాలని,ప్రొటోకాల్స్ పాటించాలని సదానంద గౌడ సూచించారు. కాగా,ఇప్పటికే అనేకమంది కేంద్రమంత్రులు కరోనావైరస్ సోకిన విషయం తెలిసిందే. అయితే,కర్ణాటక నుంచి కరోనా సోకిన రెండవ కేంద్రమంత్రిగా సదానందగౌడ నిలిచారు. ఈ ఏడాది సెప్టెంబర్ లో కర్ణాటకకు చెందిన కేంద్రమంత్రి సురేష్ అంగడి కరోనా సోకి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే.

Related Tags :

Related Posts :