Unlock 4.0 : తెరుచుకొనేవి, తెరుచుకోనివి ఏవీ ?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

భారతదేశంలో కరోనా కారణంగా..కేంద్రం విధించిన లాక్ డౌన్ దశల వారీగా నిబంధనలు ఎత్తేస్తోంది. పలు రంగాలకు మినహాయంపులు ఇస్తోంది. మరో రెండు రోజుల్లో అన్ లాక్ 3.0 నుంచి అన్ లాక్ 4.0 అమల్లోకి రానుంది.ఏయే రంగాలకు మినహాయింపు ఇవ్వాలనే దానిపై అధికారులు కసరత్తులు జరుపుతున్నారు. 2020, ఆగస్టు 29వ తేదీ శనివారం గ్రూప్ ఆఫ్ సెంట్రల్ మినిస్టర్స్ (జీవోఎం) సమావేశమైంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా.హర్షవర్ధన్ ఆధ్వర్యంలో సమావేశం జరుగుతోంది.

అన్ లాక్ 4.0 మార్గదర్శకాలు విడుదల కానున్న నేపథ్యంలో కేంద్ర మంత్రుల భేటీ జరుగుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలో కరోనా వ్యాప్తి, మంత్రిత్వ శాఖల వారీగా తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్ కార్యాచరణ, రాష్ట్రాలకు కేంద్రం చేయాల్సిన సాయంపై చర్చింస్తున్నారు. ప్రస్తుతం అన్ లాక్ – 4.0లో కీలకమైన వాటికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందనే ప్రచారం జరుగుతోంది.మార్చి 22వ తేదీ నుంచి షెడ్లకే పరిమితమైన మెట్రో రైళ్లకు ఢిల్లీ, ఎన్ సీఆర లో పర్మిషన్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. కాంటాక్ట్ లెస్ టికెట్ విధానం అమల్లోకి తేనున్నట్లు, ఇకపై టోకెన్లను ఉపయోగించడానికి అనుమతించరని తెలుస్తోంది.

మాస్క్ ధరించకపోతే, సోషల్ డిస్టెన్స్ పాటించకపోతే, స్టేషన్ ప్రాంగణంలో ఉమ్మి వేయడం, చెత్త వేస్తే…భారీ జరిమానాలు విధించే అవకాశం ఉంది.పాఠశాలలు, కళాశాలలు మూసివేసేందుకు నిర్ణయం తీసుకుంటారని, మూసివేయబడిన బార్ల కౌంటర్ల వద్ద మద్యం విక్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ..నిబంధనలు పాటిస్తూ..25-30 సామర్థ్యంతో షోలను నడపడం సాధ్యం కాదు కనుక..సినిమా హళ్లకు తెరిచేందుకు అనుమతినివ్వరని సమాచారం.కర్నాటక రాష్ట్రంలో సెప్టెంబర్ 01 నుంచి ఆన్ లైన్ తరగతులతో ప్రారంభమౌతుండగా, ఆఫ్ లైన్ తరగతులు నిర్వహించాలని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

ఇక్కడి రాష్ట్రంలో సినిమా హాళ్లు, రెస్టారెంట్లలో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.
డొమెస్టిక్ ఫ్లైట్స్ లను కోల్ కతాలో దిగడానికి అనుమతించబడుతాయి.సెప్టెంబర్ 01 నుంచి ఆరు రాష్ట్రాలు (ఢిల్లీ, ముంబై, పూణె, నాగ్ పూర్, చెన్నై, అహ్మదాబాద్)కు విమాన సర్వీసులు వారానికి మూడు సార్లు తిరిగేందుకు అనుమతినిచ్చే అవకాశాలున్నాయని సీఎం మమత బెనర్జీ చెప్పారు.

వచ్చే నెలలో పబ్బులు తెరిచే అవకాశం ఉన్నా..వారానికి రెండు సార్లు పూర్తిస్థాయి లాక్ డౌన్ అమల్లో ఉంది.ముంబైలో స్థానిక రైళ్లకు అనుమితించే ఛాన్స్ లేదు. బయటకు వస్తే..సరైన కారణం చూపకపోతే..వాహనాలను స్వాధీనం చేసుకుంటామని ముంబై పోలీసులు హెచ్చరిస్తున్నారు.

అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లాలకు వెళ్లాలంటే..ఈ – పాస్ తప్పనిసరి అని చెన్నై అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మద్యం, హోటళ్లపై పరిమిత సంఖ్యలో సడలించే అవకాశాలు కనిపిస్తున్నాయి.భారతదేశంలో కరోనా కారణంగా..కేంద్రం విధించిన లాక్ డౌన్ దశల వారీగా నిబంధనలు ఎత్తేస్తోంది.

Related Posts