అన్ లాక్ 3.0 : సినిమా థియేటర్లకు “నో” పర్మీషన్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా లాక్‌డౌన్‌ నిబంధనలను దశల వారీగా సడలిస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా అన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీచేసింది. జూలై 31తో అన్‌లాక్‌ 2.0 గడువు ముగియనుండటంతో.. కేంద్రం తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది.అయితే నిన్న,మొన్నటివరకు అన్ లాక్ 3.0 లో సినిమా థియేటర్లు,జిమ్ లు తెరిగి తెరుచుకునేందుకు అనుమతి లభిస్తది అన్న వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ కేంద్రం విడుదల చేసిన అన్ లాక్ 3.0 మార్గదర్శకాలలో.. ఆగష్టు-5నుంచి జిమ్ లు,యోగా సెంటర్లు తిరిగి తెరుచుకునేందుకు అనుమతిచ్చిన కేంద్రం …సినిమా థియేటర్లకు మాత్రం అనుమతి ఇవ్వలేదు.


ఆగస్టు 5 నుంచి నాన్ కంటైన్మెంట్ జోన్లలో జిమ్స్‌, యోగా సెంటర్లు తిరిగి తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది. విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు ఆగస్టు 31 వరకు మూసివేసి ఉంచాలని కేంద్రం స్పష్టం చేసింది. మెట్రో సర్వీసులు, స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లపై నిషేధం కొనసాగుతుందని వెల్లడించింది.సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, బార్లు సహా ప్రజలు గుమిగూడే ఆస్కారం ఉన్న ఇతర అన్ని కార్యకలాపాలపై నిషేధం కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది(అయితే పరిస్థితులను అంచనా వేసి వీటి అనుమతులపై నిర్ణయం తీసుకోనున్నట్టు కేంద్రం తెలిపింది). కంటెయిన్‌మెంట్ జోన్లలో ఆగస్టు 31 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందని తెలిపింది. అన్‌లాక్‌ 3.0 లో భాగంగా అగస్ట్-1 నుంచి రాత్రి పూట కర్ఫ్యూను ఎత్తివేసింది. ప్రజలు రాత్రి పూట బయట తిరగవచ్చు. అయితే, కరోనా నిబంధనలు పాటించాలి. సాధారణ అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం కొనసాగింపు ఉంటుందని తెలిపింది.

Related Posts