Home » ‘ఖిలాడి’ మాస్ మహారాజ్ డ్యుయెల్ రోల్!
Published
3 months agoon
By
sekharRaviteja’s Khiladi First Look: ‘డిస్కోరాజా’ తర్వాత మాస్ మహారాజా రవితేజ స్పీడ్ పెంచాడు. ప్రస్తుతం గోపిచంద్ మలినేనితో చేస్తున్న హ్యాట్రిక్ మూవీ ‘క్రాక్’ షూటింగ్ పూర్తికావొచ్చింది. ఆదివారం కొత్త సినిమా అనౌన్స్ చేస్తూ టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ కూడా రిలీజ్ చేశారు. ‘రైడ్’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకుని ఇటీవల ‘రాక్షసుడు’తో ఆకట్టుకున్న రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న సినిమాకు ‘ఖిలాడి’ అనే పేరు ఫిక్స్ చేశారు.
మాస్ రాజా నటిస్తోన్న 67వ చిత్రమిది. బ్లాక్ డ్రెస్‌లో తన స్టైల్లో స్టెప్ వేస్తున్న రవితేజ స్టైలిష్ లుక్ బాగుంది. బ్యాగ్రౌండ్లో డబ్బులు గాల్లో ఎగురుతున్నాయి. డా.జయంతిలాల్ గడ సమర్పణలో ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ పతాకాలపై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. రెండు డిఫరెంట్ క్యారెక్టర్లలో వైవిధ్యంగా కనిపించనున్నాడు. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
సినిమా ఆదివారం 11 గంటల 55 నిమిషాలకు లాంఛనంగా ప్రారంభమైంది. రవితేజపై చిత్రీకరించి ఫస్ట్ షాట్‌కు హీరో హవీష్ క్లాప్ నివ్వగా, రవితేజ పర్సనల్ అసిస్టెంట్ శ్రీను కెమెరా స్విచ్చాన్ చేశారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. వచ్చే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది.