లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

రెండో ప్రపంచ యుద్ధం మరణాల కంటే కరోనా మృతులే ఎక్కువ

Published

on

CoronaVirus: ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా కేసులు పది కోట్లు దాటేశాయి. కొన్ని దేశాల్లో పరిస్థితులు కుదుటపడ్డే కనిపిస్తున్నా యూరప్ వంటి దేశాల్లో కొత్త స్ట్రెయిన్ మరింత ప్రమాదకరంగా మారింది. దీనిని అదుపుచేసేందుకు ప్రభుత్వ సూచనలు పాటించాలని చెప్తున్నా ప్రజలు ఖాతరు చేయకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య రెండో ప్రపంచ యుద్ధంలో చనిపోయిన వారి సంఖ్య కంటే ఎక్కువట. అమెరికా, యూరప్ దేశాలను వణికిస్తున్న కరోనా.. మొత్తం కేసుల సంఖ్య 22లక్షలకు చేరిపోయింది. అమెరికాలో 4లక్షల మృతులు సంభవించాయని చెప్తున్నారు.

అమెరికా తర్వాతి స్థానాల్లో భారత్, బ్రెజిల్, రష్యా, యూకే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య పరంగా చూస్తే మొదటి స్థానంలో అమెరికా ఆ తర్వాతి స్థానాల్లో మిగిలినవి ఉన్నాయి. ప్రధానంగా అమెరికా, యూరప్‌ దేశాల్లో కరోనా విజృంభిస్తోంది. పలు దేశాల్లో వ్యాక్సినేషన్‌ జోరందుకుంది. కరోనా కట్టడికి కొత్త ప్రెసిడెంట్ జో బైడెన్‌ స్పెషల్ ఫోకస్ పెట్టారు. కరోనాతో తీవ్రంగా నష్టపోవడంతో బైడెన్‌ ప్రత్యేక ప్రణాళికలతో పరిస్థితిని అధిగమించాలని ప్రయత్నిస్తున్నారు. రోజుకి 15 లక్షల మంది వ్యాక్సిన్‌ ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

బ్రిటన్‌లో కనిపిస్తున్న కొత్త స్ట్రెయిన్‌తో యూరప్‌లో థర్డ్‌ వేవ్‌ కరోనా విజృంభణ మొదలైందని అంటున్నారు. కొత్త సంవత్సరం ఆరంభం నుంచి కొన్ని దేశాల్లో మళ్లీ లాక్‌డౌన్‌ వచ్చేసింది. నెదర్లాండ్స్‌లో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆంక్షలు విధించడం ఇదే తొలిసారి. ఫిబ్రవరి 9 వరకు లాక్‌డౌన్‌ అమలు తప్పనిసరి చేశారు. ఒకవేళ కర్ఫ్యూ రూల్స్ ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధిస్తున్నారు.

ఈ విషయానికి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఉరక్‌ పట్టణంలో కోవిడ్‌ సెంటర్‌ని దగ్ధం చేశారు. గవర్నమెంట్ పెట్టిన కండిషన్స్‌ని తట్టుకోలేని మరికొందరు సూపర్‌ మార్కెట్లను లూటీ చేస్తున్నారు. కరోనా ఆంక్షలపై నిరసన వ్యక్తం చేస్తున్న డెన్మార్క్‌ వాసులు హింసకు తెర తీశారు. స్పెయిన్‌లో మాస్కులు ధరించడానికి వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తిపోతున్నాయి.

ప్రజల ప్రాణాలతో చెలగాటాలాడటమే కాదు ఆర్థికంగా కూడా ప్రపంచ దేశాల్ని కుంగదీసింది. 2009 నాటి ఆర్థిక మాంద్యం కంటే కరోనా ప్రభావంతో 2020 ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిందని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ కార్మిక సంస్థ రీసెర్చ్‌లో తేలింది. 2019తో పోల్చి చూస్తే 2020లో ప్రపంచవ్యాప్తంగా పని గంటల్లో 8.8శాతం తగ్గిపోయాయి.