పన్నేండళ్ల బాలికపై రేప్.. పోలీసులపై గన్‌తో అటాక్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

పన్నెండేళ్ల బాలికను రేప్ చేసిన నిందితుడ్ని పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులపై ప్రతి దాడికి దిగి గన్ ఫైర్ చేశాడొకడు. పోలీసులు పర్ఫెక్ట్ ప్లాన్ తో అతడ్ని పట్టుకోగలిగారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో జరిగింది. ఇకోటెక్ 3 పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనపై మంగళవారం మధ్యాహ్నం కేసు ఫైల్ చేశారు.

‘అఘాయిత్యం జరిగినప్పుడు నిందితుడు ముఖానికి మాస్క్ ధరించి ఉన్నాడు. దీనిపై ప్రత్యక్ష సాక్ష్యులు ఎవరూ లేకుండాపోయారు. బాధితురాలు కూడా నిందితుడ్ని చూడడం అదే తొలిసారి. పోలీస్ టీంలో కేసును చేధించి నిందితుడిని పట్టుకోగలిగారు’ అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వృందా శుక్లా అన్నారు.

ఆ లొకేషన్ కు పోలీస్ టీంలు చేరుకోగానే నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించాడు. టీంపై కాల్పులు జరిపాడు. అంతకుమించి ప్రతిదాడి చేసి అతడ్ని అదుపు చేయగలిగామని’ శుక్లా చెప్పారు.

బాధితురాలి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉంది. జరగాల్సిన న్యాయపరమైనచర్యలపై ఫోకస్ పెట్టామని పోలీసు అధికారి చెప్పారు.

Related Posts