ఆరేళ్ల చిన్నారిపై రేప్..: నిందితుడి ఆచూకీ చెప్తే రూ.50వేలు రివార్డు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఉత్తరప్రదేశ్ లోఇని హాపూర్ లో ఆరేళ్ల చిన్నారిపై రేప్ కేసులో దర్యాప్తు చేస్తున్న పోలీసులు… నిందితుడ్ని అరెస్ట్ చేయలేకపోయారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి మీరట్ హాస్పిటళ్లో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ విషమ పరిస్థితుల్లో ఉంది. గురుతుల్ని బట్టి మూడు స్కెచ్ లు వేయించి ఫొటోను రిలీజ్ చేసింది పోలీసు శాఖ. బాలికతో పాటు పొరుగింటి వారు చెప్పిన పోలికలతో దగ్గరగా ఉండడంతో ఫొటోను పబ్లిక్ చేశారు.

బాలిక కిడ్నాప్ అయిన ప్రాంతంలో రేప్ జరిగిన ప్రాంతంలో పోలీసులు సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నారు. ఆ వ్యక్తిని పట్టించిన వ్యక్తికి, లేదా ఏదైనా సమాచారం చెప్తే రూ.50వేల బహుమానం ఇస్తామని ప్రకటించారు. ‘ఈ వ్యక్తి గురించి ఏదైనా సమాచారం ఇస్తే రూ.50వేల రివార్డు ఇస్తాం. ఇన్ఫర్మేషన్ ను బట్టి అతని పేరు చెప్పలేకపోతున్నాం’ అని పోలీసులు అంటున్నారు.

ఢిల్లీకి 100కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో ఉన్న గర్ ముక్తేశ్వర్ ప్రాంతంలో ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిని
కిడ్నాప్ చేశారు. వచ్చిన వ్యక్తి మోటార్ సైకిల్ పై వచ్చినట్లుగా చెప్తున్నారు.

పేరెంట్స్ కనిపించడం లేదని కేసు ఫైల్ చేయడంతో సెర్చింగ్ మొదలుపెట్టారు. తర్వాతి రోజు ఉదయం రక్తంతో తడిచి అపస్మారక స్థితిలో ఉండగా గ్రామ శివార్లలోనే దొరికింది. వైద్య పరీక్షలు నిర్వహించి చిన్నారిపై రేప్ జరిగినట్లు కన్ఫామ్ చేశారు. మీరట్ లోని స్పెషలైజ్డ్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కచ్చితంగా ఒక సర్జరీ చేయాల్సి ఉంటుందని ఎటువంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు.

సోమవారం నిందితుడి మూడు స్కెచ్ లు రిలీజ్ చేశారు. గత వారం ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. ఢిల్లీలో పేరెంట్స్ పనిలో ఉండగా 12ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి జరిగింది. చిన్నారిపై కత్తులతో దాడి చేసి టార్చర్ పెట్టినట్లు AIIMS హాస్పిటల్ వైద్యులు చెప్పారు. రెండ్రోజుల విచారణ తర్వాత అతణ్ని పోలీసులు పట్టుకున్నారు.

Related Posts