అగ్రవర్ణాల పెద్దల మూత్రం తాగాలని దళిత వృద్ధుడు..కొడుకుపై దాడి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

UP : రాష్ట్రంలో దళితులపై అగ్రవర్ణాల దౌర్జన్యాలకు అడ్డుకట్టపడటంలేదు. ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్ జిల్లాలో రోడా గ్రామంలో అగ్రవర్ణాలకు చెందిన కొంతమంది వ్యక్తులు తమ మూత్రం తాగాలంటూ ఓ దళిత వృద్ధుడిపైనా..అతని కొడుకుపై ఒత్తిడి తెచ్చారు.దానికి వారు ఒప్పుకోకపోవటంతో వారిని ఇంటి నుంచి బయటకు లాక్కొచ్చి అమర్ అనే వృద్ధుడిని చావబాదారు. అతని కొడుకుపై గొడ్డలితో దాడిచేశారు.


సోమవారం (అక్టోబర్ 12,2020) సాయంత్రం అమర్ అనే వృద్ధుడి కుమారుడికి.. గ్రామంలోని మరో వ్యక్తికి మధ్య వారం రోజుల క్రితం గొడవ జరిగింది. ఈ గొడవలో అమర్ కొడుకుపై అవతలి వారు గొడ్డలితో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిపై అమర్‌, అతని కొడుకు పోలీసులకు మొరపెట్టుకున్నారు.


దీంతో తమపై కేసు పెట్టటానికి మీకెంత ధైర్యం రా మాపై పెట్టిన కేసు విత్ డ్రా చేసుకోవాలంటూ అమర్ కుటుంబంపై నిందితులు ఒత్తిడి చేస్తున్నారు. కేసు వెనక్కి తీసుకునేది లేదనీ..ఎంతకాలం మామీద ఈ దౌర్జన్యాలు భరించాలంటూ కేసు వెనక్కి తీసుకునేది లేదంటూ తెగేసి చెప్పేసరికి సదరు అగ్రవర్ణాలకు చెందిన నిందితులు అమర్ కుటుంబంపై దాడి చేశారు.


ఒక కప్పులో అగ్రవర్ణాల పెద్దల మూత్రం పట్టి అది తాగాలంటూ అమర్‌ను బలవంతం చేశారు. దీనిపై అమర్ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.


పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా.. నిందితులకు కఠిన శిక్షపడేలా చేస్తామని లలిత్‌పూర్ జిల్లా ఎస్పీ మీర్జా మంజర్ బేగ్ తెలిపారు.

Related Tags :

Related Posts :