లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

50 ఏళ్ల మహిళపై పాశవిక అత్యాచారం..ఎముకలు, కాళ్లు విరగ్గొట్టి కిరాతకంగా..

Published

on

UP: women suffers Nirbhaya like torture..gang raped : ఉత్తరప్రదేశ్‌లో దారుణాతిదారుణ ఘటన జరిగింది. బదౌన్‌ జిల్లాలో మానవ మృగాళ్ల అకృత్యానికి 50ఏళ్ల మహిళ అంత్యంత దారుణంగా బలైపోయింది. దేవాలయానికి వెళ్లిన 50 ఏళ్ల మహిళపై కామాంధులు విరుచుకుపడ్డారు. ఆమె దేహంతో ఆటబొమ్మతో ఆడుకున్నట్లుగా అత్యంత కిరాతకంగా..పాశవికంగా ఇష్టమొచ్చినట్లుగా ఆడుకున్నారు. తమ కామవాంఛ తీరాక వినటానికే వెన్నులో వణుకుపుట్టేవిధంగా ఛిద్రం చేశారు.

దేవాలయానికని వెళ్లిన ఓ మహిళపై కొంతమంది కామాంధులు సామూహిక అత్యాచారం చేసి అనంతరం ఆమెను అతి కిరాతకానికి ఒడిగట్టారు. ఆమె పక్కటెముకలు విరిచేశారు. రెండు కాళ్లు విరగొట్టారు. అంతకంటే దారుణాతి దారుణంగా ఆమె ప్రైవేటు అవయవాలను దారుణంగా గాయపరిచారు. గత ఆదివారం (జనవరి 3,2021) జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ దారుణ ఘటనపై పోలీసులు ఇలా చెప్పారు..బదౌన్‌ జిల్లాలోని ఉగైతీ ప్రాంతంలో అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న 50ఏళ్ల మహిళ ఆదివారం సాయంత్రం ఆ ప్రాంతంలో ఉండే ఓ దేవాలయానికి వెళ్లింది. ఆమె ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆమె కోసం ఊరంతా వెతికారు. కానీ ఫలితం కనిపించలేదు. ఈక్రమంలో అర్ధరాత్రి సమయంలో ఆలయ పూజారి మరో ఇద్దరు కలిసి తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న మహిళను ఇంటికి తీసుకొచ్చినట్లు ఆమె కొడుకు చెప్పాడు.

మా అమ్మకు ఏమైందని ఆమె కొడుకు పూజారిని అడుగగా..ఈమె బావిలో పడిపోయిందని.. ఆమె అరుపులు విని తాము రక్షించి తీసుకొచ్చామని చెప్పి వెళ్లిపోయారని ఆమె కొడుకు చెప్పాడని పోలీసులు తెలిపారు. అయితే అప్పటికే తీవ్ర రక్తస్రావమైన ఆ మహిళ ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు మృతిచెందింది.

దీంతో మృతురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహానికి పోస్ట్‌మార్టం జరిపించారు. శవపరీక్షలో పోలీసులే షాక్ అయ్యే విషయాలు వెల్లడయ్యాయి. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందనీ..ఈ దారుణ ఘటనలో ఆమెను సదరు నిందితులు తీవ్రంగా గాయపర్చినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో తేలింది.

ఆ మహిళ పక్కటెముకలు, కాళ్లను విరగ్గొట్టి, ఊపిరితిత్తులపై బలమైన వస్తువుతో పొడిచారని తేలింది. అంతేకాక ఆమె వ్యక్తిగత అవయవాలను కూడా దారుణంగా గాయపరిచారని నివేదికలో వెల్లడైంది. ఈ ఘటనపై కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఆలయ పూజారి, మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.