లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

కట్నం వద్దు..కొబ్బరిబోండాం చాలు అన్న జవాన్..మురిసిపోయిన వధువు…

Published

on

UP : army jawan took dowry one rupee and a coconut : ‘‘బంగారంలాంటి మీ అమ్మాయే నాకు పెద్ద కట్నం..ఇంక నాకు ఈ కట్నకానుకలు వద్దండీ అని ఓ జవాన్ ఆదర్శంగా నిలిచారు. కట్నానికి బదులుగా వారిని నొప్పించకుండా ఒక కొబ్బరి బోండాం..ఒకే రూపాయి తీసుకుని పెళ్లి చేసుకున్నాడో రక్షణశాఖలో పనిచేస్తున్న జవాన్.ఈ విషయం తెలిసినవారంతా దేశం కోసం ప్రాణాలర్పించే డ్యూటీ చేయటమే కాకుండా కట్నం తీసుకోని ఆ జవానుకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. మూడు సంవత్సరాల పాటు కార్గిల్‌లో సైనికుడిగా సేవలందించి వివేక్ ప్రస్తుతం లక్నోలో డ్యూటీ చేస్తున్నారు. వరకట్నవ్యవస్థను రూపుమాపాలని మంచి ఉద్ధేశ్యంతో వివేక్ చేసుకున్న వివాహం ఇప్పుడు ఆసక్తికరంగా..ఆదర్శంగా నిలిచింది.వివరాల్లోకి వెళితే..గంగోహ్ పరిధిలోని జుఖెడి గ్రామనివాసి సంజయ్ కుమార్ కొడుకు వివేక్ కుమార్‌. వివేక్ కు బీన్డాకు చెందిన అరవింద్ కుమార్ కూతురు ప్రియతో గత మంగళవారం అంటే నవంబరు 30,2020న పెద్దలు నిశ్చయించిన ముహూర్తానికి వివాహం జరిగింది.పెళ్లి సందర్భంగా వధువు తల్లిదండ్రులు కట్నకానుకల రూపంలో లక్షల రూపాయలు ఇవ్వాలు పళ్లెంలో పోసి కట్నంకింది ఇవ్వాలనుకున్నారు. అలా వరుడు వివేక్ ఇస్తుండగా ‘‘నాకు ఎటువంటి కట్నకానుకలు వద్దని కేవలం ఒక్క రూపాయి, కొబ్బరిబోండం చాలని చెప్పాడు. వాటినే తీసుకుని ఇవి కూడా మీ మనస్సు నొప్పించకూడదని తీసుకుంటున్నానని..బంగారంలాంటి మీ అమ్మాయే నాకు అందమైన కట్నమని తెలిపాడు.దీంతో అల్లుడు పెద్ద మనస్సుకి అత్తమామలతో పాటు పెళ్లికొచ్చినవారంతా మురిసిపోయారు. నీలాంటివాళ్లు ఉంటే ఆడపిల్ల తల్లిదండ్రులకు ఎంత సంతోషమో నని అల్లుడిని ప్రశంసలతో ముంచెత్తారు. ఇక వధువు ప్రియ సంగతి చెప్పనే అక్కరలేదు. అంత మంచి భర్త లభించినందుకు తెగ సంతోషపడిపోయింది. తన భర్త ఆదర్శభావాలకు మురిసిపోయింది.కాగా వివేక్, ప్రియలకు నిశ్చితార్థం జరిగి సంవత్సరం అయ్యింది. వివేక్ ఉద్యోగ బాధ్యతల కారణంగా పెళ్లి కాస్త ఆలస్యం అయ్యింది. ఈక్రమంలో వివేక్‌ను ఇటీవలే లక్నోకు ట్రాన్సఫర్ అయ్యారు. దీంతో వీరి పెళ్లికి ఆటంకాలు తొలగిపోయి సంబరంగా పెళ్లి జరిగింది. దీనికి తోడు అల్లుడు కట్నం వద్దనే సరికి వారి ఆనందానికి అవధుల్లేవు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *