యూపీలో రామోజీ ఫిలిం సిటీ కంటే అతిపెద్ద ఫిలిం సిటీ నిర్మాణం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

హైదరాబాద్ లో రామోజీ ఫిలిం సిటీ. అత్యద్భుతమైన రామోజీ ఫిలిం సిటీ ప్రపంచ వ్యాప్తంగా పేరొందింది.అటువంటి రామోజీ ఫిలిం సిటీని తలదన్నేలా అతి పెద్ద ఫిలింసిటీని నిర్మించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రెడి అయ్యింది. దీనికి అనుకూలనమైన భూమికి సంబంధించిన ప్రతిపాదనల్ని ఎంపిక చేయాలని, శుక్రవారం (సెప్టెంబర్ 18,2020) సీఎం యోగి ఆదిత్యానాథ్ అధికారులకు ఆదేశించారు.


నోయిడాలో దీన్ని ఏర్పాటు చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఘజియాబాద్, బులంద్‌షహర్, హాపూర్, బాగ్‌పట్, గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలతో కూడిన అభివృద్ధి ప్రాజెక్టుల సమీక్షలో పాల్గొన్న సీఎం యోగీ ఈ విషయాన్ని వెల్లడించారు. దేశంలోనే అతి పెద్దగా, సౌకర్యవంతంగా..అత్యాధునిక సాంకేతికతతో ఈ ఫిలిం సిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు.


యూపీలో దీనితో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలపై కూడా ఆయన దృష్టి పెట్టిన సీఎం గోల్ఫ్ కోర్సు , మెట్రో విస్తరణ, షూటింగ్ రేంజ్ వంటి ప్రాజెక్టుల పనులపై సమీక్ష జరిపారు. 2025 మార్చిలోగా మెట్రో ప్రాజెక్ట్ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా..అభివృద్ధి పేరుతో అధికారులుగానీ కాంట్రాక్టర్లు గానీ నిధుల దుర్వినియోగం చేస్తూ అక్ర‌మాల‌కు పాల్ప‌డితే కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. కాగా ఇప్పటికే అయోధ్యలో అతిపెద్ద రామ మందిర నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ఇక ఫిలిం సిటీ నిర్మాణంతో మరింత అభివృద్ధి జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.


ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలింసిటీగా పేరొందిన రామోజీ ఫిలిం సిటీ దాదాపు 3వేలఎకరాల్లో విస్తరించి ఉంది. ఇది రాష్ట్రానికే కాదు దేశానికే తలమానికంగా విరాజిల్లుతోంది. రామోజీ గ్రూపు అధినేత రామోజీరావు 1996లో స్థాపించిన ఈ ఫిలింసిటి పర్యాటక ప్రదేశం గానూ పేరుగాంచింది. ఇందులో తెలుగు సినిమాలే కాకుండా దేశ, విదేశాలకు చెందిన అనేక భాషా చిత్రాలు, టెలివిజన్ సీరియళ్లు నిర్మాణాలకు మంచి అనుమైన సిటీగా నిలబడింది.


ఉద్యానవనాలు..రకరకాల దేశ విదేశీ శిల్పాలు, పూలతోటలు, సినిమా దృశ్యాలకు కావలసిన అన్ని రకరకాల రంగస్థలాలు ఉన్నాయి. ఒక్కసారి సందర్శిస్తే మళ్లీ మళ్లీ చూడాలనే అద్భుతమైన స్వర్గంలా ఉంటుంది రామోజీ ఫిలింసిటీ. ప్రతీరోజు ఇక్కడ అనేక కార్యక్రమాలు జరుగుతుంటాయి.

Related Posts