లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

చేతులెత్తేసిన పోలీసులు…రైతుల తగవు తీర్చిన గేదె

Published

on

up : ఇద్దరు రైతుల తగవును ఓ గేదె దీర్చింది. అదేంటీ మనష్యుల తగవు గేదె తీర్చటమేంటీ అని ఆశ్చర్యం కలుగుతుంది. అంతే మనుషులకు కూడా లేని విశ్వాసం..నీతి..సమయస్ఫూర్తి పశువులకు ఉందని ఓ గేదె నిరూపించింది. పోలీసులు కూడా తీర్చలేని తగవుని ఓ గేదె తీర్చిన గటన యూపీలోని కన్నైజ్ జిల్లాలో జరిగింది. దీంతో అసలైన ఆ గేదె యజమాని తెగ సంతోష పడిపోతూ తన గేదెను తోలుకుని ఇంటికి చక్కాపోయాడు.


వివరాల్లోకి వెళితే..తివా కొత్వాలీ ప్రాంతంలోని అలీనగర్‌లో ఉంటున్న ధర్మేంద్రకు అనే రైతు గేదె మూడు రోజులుగా కనిపించడం లేదు. అలాగే తాలాగ్రామ్‌లో వీరేంద్ర అనే వ్యక్తి గేదె కూడా కనిపించకుండాపోయింది. వీరేంద్ర గేదెను కొంతమంది చోరీ చేశారు. అలా ఇద్దరూ తమ గేదెల కోసం వెతుకుతూ ఉండగా వారికి గేదె కనిపించింది.


ఆ గేదె మాదంటే మాదని గొడవకు దిగారు. ఇద్దరూ ఏమాత్రం తగ్గలేదు. ఇరుగుపొరుగువారు చెప్పినా వినలేదు. దీంతో ఈ వ్యవహారం పోలీసుల దగ్గరకెళ్లింది. ధర్మేంద్ర, వీరేంద్రలను పోలీసులు కూర్చోపెట్టి మాట్లాడినా అదే పరిస్ధితి. ఆ గేదె నాదంటే నాదేనని తగవులు మానాలేదు. దీంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక పోలీసులు కూడా అయోమయంలో పడిపోయారు.


దీంతో పోలీసులకు పాత కథ గుర్తుకొచ్చింది. అనగనగనగా ఓ ఊళ్లో ఇద్దరు మహిళలు ఓ చంటిబిడ్డ విషయంలో నా బిడ్డ అంటే నాబిడ్డ అని తగవులాడుకోవటం దాన్ని ఆ గ్రామ పెద్ద తెలివిగా పరిష్కరించిన కథ గుర్తుకొచ్చింది.వెంటనే ఆ ప్లాన్ అమలు చేశారు. అక్కడ చంటిబిడ్డ అయితే ఇక్కడ గేదె వివాదం..ధర్మేంద్ర..వీరేంద్రలను పక్క పక్కన నిలబెట్టి మధ్యలో గేదెను వదిలేశారు. ఇద్దరూ దాన్ని రమ్మంటూ పిలిచారు. కానీ గేదె మాత్రం తన విశ్వాసాన్ని చూపెట్టి తన అసలైన యజమాని దగ్గరకు వెళ్లింది. దీంతో పోలీసుల గేదె సమస్య వదిలిపోయింది.దాన్ని ధర్మేంద్ర గేదెగా తేల్చి అతనికి అప్పగించటంతో కథ సుఖాంతం అయ్యింది. ఇలా గేదె సమస్యను పరిష్కరించామని ఎస్సై విజయకాంత్ తెలిపారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *