లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

పూరీలు తిన్నందుకు డబ్బులడిగారనీ..షాపు యజమానిని..కొడుకుని మరిగే నూనెలోకి నెట్టేసారు

Updated On - 6:33 pm, Tue, 29 December 20

UP crime: Vendor And Son Pushed Into Boiling Oil By Youths : ఉత్తరప్రదేశ్ లో హత్యలు, అత్యాచారాలకు హద్దూ అదుపు లేకుండా పోతోంది. చల్లారిపోయిన చపాతీలు పెట్టాడని ఓ దాబా యజమానికి గత గురువారం (డిసెంబర్ 24,2020) రాత్రి దాబా యజమానిని ఓ యువకుడు తుపాకీతో కాల్చేసిన ఘటన మరచిపోకముందే..లక్నోలో ఆర్డర్ చేసిన వెంటనే సమోసాలు ఇవ్వలేదని కోపంతో సమోసాలు అమ్మే యజమాని కొడుకుని కొందరు యువకులు మరిగే మరిగే నూనెలోకి గెంటివేసిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

లక్నో నగరంలోని గోమతి నగర్‌లో రామ్‌నాథ్ యాదవ్ అనే వ్యక్తి సమోసాలు, పూరీలు అమ్ముకుంటూ జీవిస్తున్నాడు. అతనికి ఇద్దరు కొడుకులు ఇద్దరు రంజీత్, ప్రదీప్ లు సహాయం చేస్తుంటారు. ఈక్రమంలో గత శనివారం రాత్రి 8 గంటల సమయంలో వాళ్లు బండి దగ్గర సమోసాలు వేస్తున్నారు. ఈక్రమంలో వారి బండి దగ్గరకు కొంతమంది యువకులు వచ్చారు. సమోసాలు ఆర్డర్ ఇచ్చారు.

వాళ్లు అడిగినట్లుగానే రామ్ నాథ్ యాదవ్ కొడుకు ప్రదీప్ వారికి పూరీలు ఇచ్చారు. అనంతరం వాళ్లను డబ్బులు అడిగాడు.దీంతో ఆ యువకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ గొడవకు దిగారు. తిన్నవాటికే కదా డబ్బులడిగేది అలా ఇష్టమొచ్చినట్లు మాట్లాడతారేంటని రామ్ నాథ్ వారిని ప్రశ్నించాడు.

దీంతో వాళ్లు మరింతగా రెచ్చిపోతూ..రామ్ నాథ్ ను..అతని కొడుకు ప్రదీప్ ను మరిగే మరిగే నూనె బాండీమీదకు నెట్టారు. దీంతో ఆ నూనె బాండీ తండ్రీ కొడుకుల మీద పడిపోవటం అసలే పొయ్యిమీద సల సలా కాగుతున్న నూనె వారి మీద పడి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో వారిద్దరు పెద్ద పెద్దగా అరవటంతో సదరు యువకులు అక్కడినుంచి పరారయిపోయారు.

దీంతో రామ్ నాథ్ మరో కొడుకు రంజీత్ తండ్రీని సోదరుడ్ని హాస్పిటల్ కు తరలించి..అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసలు పరారీలో ఉన్న నిందితులపై క్రిమినల్ కేసు నమోదు చేసి వారికోసం గాలిస్తున్నారు.