లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

ఘోరంగా కొట్టి..పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి పెంచుకున్న గుర్రాన్నే చంపేశాడు..ఎందుకంటే

Published

on

UP hourse death case against owner: యూపీలోని కాన్పూర్ పరిధిలోని బాబూపుర్వా ప్రాంతంలో ఒక దారుణం చోటుచేసుకుంది. యజమాని సతీష్ పాల్‌ అనే వ్యక్తి తాను పెంచుకుంటున్న గుర్రాన్ని దారుణంగా కొట్టి కొట్టీ చావబాదాడు. అది బాధతో విలవిల్లాడుతున్నా అతని మనస్సు కరగలేదు. దారుణమైన దెబ్బలతో అల్లాడిపోతున్న తన గుర్రం ఇంకా చావలేదని దానికి పాయిజన్ ఇంజెక్షన్ చేసి మరీ చంపేశాడు. దానికి కారణం ఆ గుర్రం ఓ వృద్ధుడ్ని తొక్కి గాయపరిచింది. ఆ గాయాలతో హాస్పిటల్ లో చేరిన సదరు వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు.

దీంతో మృతుడి కుటుంబ సభ్యులు యజమాని సతీష్ పాల్‌పై పోలీసు కంప్లైంట్ ఇచ్చారు. తనపై పోలీసు కంప్లైంట్ ఇచ్చారని తెలుసుకున్న సతీష్ పాల్ కు తన గుర్రంపై విపరీతమైన ఆగ్రహం కలిగింది. దీంతో పట్టరాని ఆగ్రహంతో తన గుర్రాన్ని చావబాదాడు.

తరువాత దానికి విషపు ఇంజెక్షన్ ఇచ్చాడు. దీంతో ఆ విషయపు తీవ్రతకు ఆ గుర్రం ప్రాణాలు కోల్పోయింది. గుర్రం చనిపోయాక పోలీసులు తనని అరెస్ట్ చేస్తారనే భయంతో సతీష్ పాల్ పరారైపోయాడు. దీంతో కాన్పూర్ పోలీసులు సతీష్ పాల్‌పై జంతు క్రూరత్వ చట్టం కింద కేసు నమోదు చేసి..పరారీలో ఉన్న సతీష్ పాల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఈ ఘటనపై పోలీసు అధికారి దీపక్ భూకర్ మాట్లాడుతూ.. గుర్రం దాడిలో ఒక వ్యక్తి గాయపడి చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందాడనీ..దీంతో ఆ గ్రుర్రం యజమానిపై కేసు నమోదు చేశామని..అయితే ఇంతలోనే తమకు ఆ గుర్రం చనిపోయిందని తెలిసిందనీ దానికి కారణం ఆ గుర్రాన్ని దాని యజయాని సతీఫ్ పాలే చంపేశాడని తెలుసిందని దీనిపై కూడా సతీష్ పాల్ పై కేసు నమోదు చేశామని తెలిపారు. పరారీలో ఉన్న సతీష్ పాల్ కోసం గాలిస్తున్నామని తెలిపారు.