Home » చల్లారిపోయిన చపాతీలు పెట్టాడని దాబా యజమానిని తుపాకీతో కాల్చేసాడు
Published
2 months agoon
UP : dhaba owner shooted serving cold chapatis : ఉత్తర ప్రదేశ్ లో చపాతీ ఓ వ్యక్తి ప్రాణాన్ని నిలువునా తీసేసింది. చల్లారిపోయిన చపాతీలు పెట్టాడని ఓ దాబా హోటల్ యజమానికి తుపాకీతో కాల్చి పడేశాడో యువకుడు. రాత్రి 11 గంటలకు తినటానికి ఏమన్నా దొరకటమే మహా భాగ్యం అనుకోకుండా చల్లారిన చపాతీలు పెట్టిన హోటల్ యజమానికి కాల్చేసిన ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన అమిత్ చౌహాన్, కసుస్తాబ్ సింగ్ అనే ఇద్దరు యువకులు బాగా ఆకలిమీదున్నారు. తినటానికి ఏమన్నా దొరుకుతుందేమోనని పలు హోటల్స్ కు వెళ్లారు. కానీ దాదాపు అన్ని హోటల్స్ మూసేశారు. దీంతో అలా వస్తుండగా వారికి ఓ దాబా హోటల్ తెరిచి ఉండటాన్ని గమనించి దాంట్లోకి వెళ్లారు. దాబా హోటల్స్ రాత్రి అంతా తీసే ఉంటారనే విషయం తెలిసిందే. అలా గురువారం (డిసెంబర్ 24,2020) రాత్రి 11 గంటలు దాటాక తెరిచి ఉంచిన దాబాలోకి వెళ్లారు.
చపాతీలను ఆర్డర్ చేశారు. డాబాను మూయటానికి సిద్ధంగా ఉన్న యజమాని మిగిలి ఉన్న చపాతీలను వారికి పెట్టాడు. అప్పటికే ఆ చపాతీలు చల్లగా అయిపోయాయి. దీంతో చల్లారిపోయినవి పెట్టావేంటీ అంటూ గొడవకు దిగారు. దానికి అతను ఇవే ఉన్నాయి. ఇప్పుడు చేయాలంటే ఎవ్వరూ లేరు అని చెప్పాడు. దానికి ఆ యువకులు మరింతగా రెచ్చిపోయారు. గొడవ పెట్టుకున్నారు.
అలా ముగ్గురి మధ్య మాటమాట పెరిగి గొడవ పెద్దదైంది. దీంతో ఆగ్రహానికి గురైన కసుస్తాబ్ సింగ్ జేబులోని తుపాకి తీసి డాబా యజమానిని కాల్చేశాడు. దాంతో బుల్లెట్ దాబా యజమాని కుడి తొడలోకి దూసుకుపోయింది. దీంతో అతడ్ని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు బుల్లెట్‌ను బయటకు తీశారు. అతడికి ప్రాణాపాయం ఏమీ లేదని చెప్పారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. వారి వద్ద ఉన్న ఆ తుపాకీకి లైసెన్స్ ఉందా? అని..లైసెన్స్ ఉన్నా ఓ వ్యక్తిని అతి చిన్న కారణానికే కాల్చేసిన ఘటనపై విచారిస్తున్నారు.