లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

భార్యను మద్యం తాగమని వేధింపులు..స్నేహితులతో కలిసి దవడ ఎముకలు విరగ్గొట్టిన భర్త

Published

on

UP dowry Harassment : వరకట్నం. ఈ మహమ్మారికి ఎంతమంది మహిళలు బలైపోయారు. మరెంతోమంది వరకట్న వేధింపులకు గురవుతున్నారు. అటువంటి మరో మహిళ వరకట్న హింసలకు గురవుతోంది. నిత్యం అత్తమామలతోను భర్తతోను నరకమే అనుభవిస్తోంది. శారీరకంగా..మానసికంగా వేధింపులకు గురయ్యే ఆ నిస్సహాయ మహిళ అనుభించే వేదన తెలిసిన కన్నవారు తల్లడిల్లిపోయారు. భర్త తన స్నేహితులతో కలిసి ఆమెను మద్యం తాగమని వేధిస్తూ..దారుణంగా కొట్టాడు. ఈ ఘటనలో ఆమె దడవ ఎముకలు చిట్లిపోయాయి. ఈ దారుణ హింసలు భరిస్తున్న కూతురి గురించి ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో బైటపడ్డాయి.

ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌కు చెందిన నాత్తు లాల్ అనే వ్యక్తి కమలేష్ అనే యువకుడికి తన కూతురు నేహాను మార్చి 2007 లో వివాహం చేశాడు. పెళ్లి సందర్భంగా నాత్తులాల్ అల్లుడికి కట్నం కింద రూ .3.5 లక్షలు ఇచ్చి ఘనంగా పెళ్లి చేశాడు. కొంతకాలం బాగానే వారి కాపురం సాగింది. కొన్నాళ్ల నుంచి ఆమెకు అత్తమామలు, భర్త కలిసి అదనంగా మరో రూ .2 లక్షలు తీసుకురావాలని హింసించటం మొదలు పెట్టారు. పెళ్లి జరిగి ఇంత కాలం అయినా ఇంకా కట్నం ఇవ్వాలని వేధిస్తుంటంతో కూతురు కోసం నాత్తులాల్ రూ .1.5 లక్షలు ఇచ్చాడు.

కానీ కమలేష్ డబ్బు పిచ్చి తగ్గలేదు. ఇంకా డబ్బు తేవాలని వేధించటం మానలేదు. దీనికి తోడు మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన భార్య ప్రశ్నించింది. దీంతో మరింతగా రెచ్చిపోయాడు భార్యను ప్రతీ రోజు హింసించటం ఎక్కువచేశాడు. స్నేహితుల్ని ఇంటికి తీసుకురావటం..వారి ముందే భార్యను తిట్టటం. కొట్టటం చేసేవాడు.

ఈక్రమంలో గత బుధవారం (జనవరి 13) కమలేష్..అతని స్నేహితులతో కలిసి నేహాను మద్యం తాగమని బలవంతం చేశారు. దానికి ఆమె ఒప్పుకోలేదు.దీంతో అప్పటికే బాగా తాగి ఉన్న కమలేష్ అతని ఇద్దరు స్నేహితులు కలిసి ఆమె స్పృహ కోల్పోలా కొట్టారు. ఆ దెబ్బలకు ఆమె దవడ ఎముకలు చిట్లిపోయాయి.

కూతురు పరిస్థితి తెలుసుకున్న తల్లితండ్రి తల్లడిల్లిపోయారు. తన కూతురిని వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేసి చికిత్సనందిస్తున్నారు. ఇక ఎన్నాళ్లు ఈ హింసలు భరించాలి? ఇలాగైతే తన కూతుర్ని చంపేస్తారని భయపడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కూతుర్ని మద్యం తాగమని మత్తు పదార్ధాలు తీసుకోవాలని బలవంతం చేసి దారుణంగా కొట్టారని..ఫిర్యాదులో పేర్కొన్నాడు. వారి హింసలకు తన కూతురు దవడ ఎముకలు చిట్లిపోయాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కమలేష్ ను శుక్రవారం (జనవరి 15) అతని స్నేహితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారిపై వరకట్నం హింసలకేసుగా కేసు నమోదు చేసుకున్నామని పిలిభిత్ కొత్వాలి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ శ్రీకాంత్ ద్వివేది తెలిపారు.