లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime Stories

ప్రేమించిన వాడిని గ్రైండర్ రాయితో కొట్టి చంపేసింది..

Published

on

UP girlfriend killed lover using grinding stone : నువ్వంటే నాకిష్టం..నువ్వులేనిదే నేనుబతకలేను అనుకున్న ఇద్దరు ప్రేమికులు కలిసుందాం రా..అనుకున్నారు. మనిద్దరికీ ఒకరిమీద మరొకరికి ఎంతో నమ్మకం ఉందని అటువంటప్పుడు మనకు ‘పెళ్లి’ అవసరం లేదు అనుకున్నారు. ఇద్దరూ కలిసి (లివింగ్ రిలేషన్) జీవిస్తున్నారు. వారితో పాటు యువకుడి తల్లి కూడా కలిసే ఉంటోంది. కొంతకాలం చాలా బాగా ఉన్నారు. ఒకరికోసం ఒకరుగా బతికారు. కానీ ఏమైందో తెలీదు.ఇద్దరి మధ్యా గొడవలొచ్చాయి. మాటా మాటా పెరిగింది.‘నాకు నువ్వు నీకు నేను’ అనుకున్నవారు కాస్తా నువ్వెంత అంటే నువ్వెంత? అనుకున్నారు. కోపం తారాస్థాయికి వెళ్లింది. నోటికొచ్చినట్లల్లా తిట్టుకున్నారు. ఇంకేముంది? ఎడమొహం పెడమొహం. మాట్లాడుకోవటమే మానేశారు. కానీ ఒకరిమీద మరొకరికి ఉన్న కోపం మాత్రం పోలేదు. ఈ క్రమంలో గర్ల్ ఫ్రెండ్ అతన్ని గ్రైండర్ లోని రాయితో తలపై కొట్టి చంపేసింది. ఈ ఘటన యూపీలోని హమీర్పూర్ జిల్లాలోని రాత్ అనే ప్రాంతంలో జరిగింది. ప్రేమించిన అమ్మాయే ప్రేమికుడ్ని కొట్టి చంపేసింది.వివరాల్లోకి వెళితే..హమీర్పూర్ జిల్లాలోని రాత్ ప్రాంతానికి చెందిన వీరేంద్ర అనే 2 ఏళ్ల యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఒక యువతిని ప్రేమించాడు. ఇద్దరం కలిసి ఉండటానికి పెళ్లి అవసరం లేదనుకున్నారు. కలిసి జీవిస్తున్నారు. దీనికి వీరేంద్ర తల్లికూడా ఒప్పుకోవటంతో ఆమెకూడా వారితో కలిసే ఉంటోంది. ఆమె ఓ హాస్టల్ లో వంట చేస్తుంటుంది.


కొంతకాలంగా బాగానే ఉన్న క్రమంలో ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి. మనస్పర్థలు తీవ్ర స్థాయికి చేరాయి. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నా ఒకరినొకరు సరిగా మాట్లాడుకోవడం లేదు. కనీసం పలకరించుకోవడం కూడా లేదు. ఈక్రమంలో గత మంగళవారం (నవంబర్ 10,2020) సాయంత్రం 5 గంటల సమయంలో మరోసారి ఇద్దరి మధ్యా గొడవ మొదలైంది. ఇద్దరూ బాగా వాదించుకున్నారు. అందరినీ వదులుకుని నీతో ఉంటున్నాను అంటు నేను మాత్రం కాదా? అంటూ నిందించుకున్నారు.


కోపం ఆగ్రహంగా మారింది. ఆమె వివేకం కోల్పోయింది. కోపంతో బుసలు కొడుతూ వీడి కోసం నేను అందరినీ వదులుకుని వస్తే నువ్వెంతా? అంటాడా అనే మాట మనస్సులో పెట్టుకుంది. మనస్సు కుతకుతలాడిపోయింది. ఈక్రమంలో వీరేంద్ర తల్లి పనిమీద బైటకు వెళ్లిన సమయంలో..ఇదే అదనుగా భావించిన ఆమె పడుకుని ఉన్న వీరేంద్ర తలపై గ్రైండింగ్ రాయితో గట్టిగా బాదింది. దీంతో వీరేంద్ర రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటూ చనిపోయాడు. ఆ తరువాత ఆమె అక్కడ నుంచి పరారైపోయింది.


రాత్రి 8 గంటల సమయంలో వీరేంద్ర తల్లి హాస్టల్ నుంచి తిరిగి వచ్చి చూడగా ఇంటి డోర్ తెరిచే ఉంది. దీంతో ఆమె అదేంటీ డోర్ తీసేఉందేంటీ అని అనుమానంతో లోపలికెళ్లి చూడగా రక్తపు మడుగులో కొడుకు పడి ఉండటం చూసిన ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. ఇంట్లో ఆమె లేకపోవటంతో ఆమె ఈ దారుణం చేసి ఉంటుందని నమ్మింది.కోరిన అమ్మాయితో సంతోషంగా ఉంటాడనుకున్న ఆ తల్లి కొడుకు ప్రేమించిన అమ్మాయే కొడుకు ప్రాణం తీసిందని తెలిసి గుండెలవిసేలా ఏడ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు పరిస్థితిని సమీక్షించి కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితురాలి కోసం గాలిస్తున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *