ఎంతమంది బ్రాహ్మణులకు గన్ లైసెన్స్ లు ఉన్నాయి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఎంతమంది బ్రాహ్మణులకు గన్ లెసెన్స్ లు ఉన్నాయో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినట్లు చర్చు జరుగుతోంది. ఎంతమంది దోషులుగా తేలారు ? బ్రాహ్మణుల రక్షణ కోసం ప్రభుత్వం ఏం చేస్తోంది ? తదితర వివరాలు తెలియచేయాలని బీజేపీ ఎమ్మెల్యే దేవమణి ద్వివేది ఆగస్టు 16వ తేదీన అసెంబ్లీ ప్రిన్స్ పల్ సెక్రటరీ ప్రదీప్ దూబేకు లేఖ రాశారు. రాష్ట్రంలో ఎంతమంది బ్రాహ్మణులు గన్ లైసెన్స్ ల కోసం దరఖాస్తు చేసుకున్నారు ? వీరిలో ఎంత మందికి లెసైన్స్ వచ్చింది ?మూడు రోజుల్లోగా వివరాలు పంపించాలని రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ సెక్రటరీ ప్రకాష్ చంద్ర అగర్వాల్..మెజిస్ట్రేట్ లేఖ ద్వారా కోరారు. కానీ అలాంటిదేమి లేదని దూబే కొట్టిపారేశారు. ప్రభుత్వం నుంచి అలాంటి వివరాలు కోరలేదని వెల్లడించడం విశేషం. జిల్లా మెజిస్ట్రేట్ లకు లేఖలు పంపించడంపై అగర్వాల్ నిరాకరించగా..ఆ ప్రక్రియ ఇప్పుడు కొనసాగడం లేదని మరో సీనియర్ అధికారి వెల్లడించారు.

కాన్పూర్ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఎన్ కౌంటర్ తర్వాత…యూపీలో బ్రాహ్మణులపై చర్చ జరిగింది. వికాస్ దూబేతో పాటు ఎన్ కౌంటర్లలో చనిపోయిన అతని ఐదుగురు అనుచురులు బ్రాహ్మణులు కావడం మరిన్ని హాట్ హాట్ చర్చలు కొనసాగాయి. దూబే జరిపిన దాడిలో డిప్యూటీ ఎస్పీతో పాటు 8 మంది పోలీసులు మరణించిన సంగతి తెలిసిందే.యూపీలో బ్రాహ్మణుల ప్రభావం అధికంగా ఉంటుంది. వీరి ఓటు బ్యాంకు తక్కువనే. కానీ..సామాజిక, రాజకీయ సమీకరణాల్లో వీరు కీలకం. బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని తమవైపుకు తిప్పుకోవడానికి బీఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. తమకు ఓట్లు వేస్తే..భగవాన్ పరుశురాం..ఆసుపత్రులు నిర్మిస్తామని బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే..బ్రాహ్మణుల కోసం 108 అడుగుల ఎత్తయిన పరుశురాం విగ్రహం నిర్మిస్తామని ఎస్పీ అధినేత అఖిలేష్ ప్రకటించారు.

Related Posts